అక్షరటుడే, వెబ్డెస్క్ : Warangal | రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల తుపాకులతో దాడులు పాల్పడుతున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ ముఠా తుపాకీతో బెదిరించి దారి దోపిడీలకు పాల్పడుతోంది. ముగ్గురు యువకులు ముఠాగా ఏర్పడ్డారు. హైవేలపై వెళ్లే లారీలను లక్ష్యంగా చేసుకొని దోపిడీకి పాల్పడుతున్నారు. అంతేగాకుండా పెట్రోల్ బంక్లో సైతం బెదిరింపులకు పాల్పడి దోపిడీలు చేశారు.
Warangal | విచారిస్తున్న పోలీసులు
ఈ ముఠా ఇటీవల హన్మకొండ (Hanmakonda) జిల్లా శాయంపేట (Shayampet) మండలం మందారిపేట సమీపంలో ఓ లారీ డ్రైవర్ను దోపిడీ చేసింది. పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి డబ్బులు లాక్కున్నారు. అనంతరం ఆయనపై దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ లారీ డ్రైవర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఒకరిని హన్మకొండలో, ఇద్దరిని ములుగు (Mulugu) జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా నిందితులు హైదరాబాద్ (Hyderabad)లో పిస్టల్ కొన్నట్లు తెలిసింది.
Warangal | తుపాకులు ఎక్కడివి
ఇటీవల రాష్ట్రంలో తుపాకులతో దోపిడీలు, దాడులు చేపడుతున్న ఘటనలు పెరిగాయి. గతంలో హైదరాబాద్లోని చందానగర్లో ఓ ముఠా తుపాకులతో చొరబడి నగల దుకాణంలో చోరీ చేసింది. ఇటీవల మేడ్చల్ జిల్లా పోచారంలో ఓ వ్యక్తి తుపాకితో గో రక్షకుడిపై కాల్పులు జరిపాడు. తాజాగా వరంగల్ జిల్లాలో తుపాకీతో దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గన్ కల్చర్ పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీరికి తుపాకులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే ఆందోళన నెలకొంది.
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ యుగంతో చాలా మంది యువత వ్యసనాలకు బానిసలుగా మారారు. తక్కువ కాలంలో డబ్బు సంపాదించాని నేరాల బాట పడుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారికి తుపాకులు దొరికితే మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. పోలీసులు స్పందించి రాష్ట్రంలో తుపాకుల విక్రయాలపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
