ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Ganesh immersion | ఇందూరులో ప్రారంభమైన వినాయకుడి శోభాయాత్ర

    Ganesh immersion | ఇందూరులో ప్రారంభమైన వినాయకుడి శోభాయాత్ర

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Ganesh immersion | ఇందూరు నగరంలో ప్రతిష్టాత్మకమైన వినాయకుడి రథయాత్ర శనివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief Bomma), ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి(Mla Sudarshan Reddy), ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (Mla Dhanpal), నుడా ఛైర్మన్ కేశ వేణు (NUDA Chairman Kesh Venu), కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy), సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) జెండా ఊపి రథయాత్రను ప్రారంభించారు.

    ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. గత దశాబ్దాలుగా ఏళ్లుగా సాంప్రదాయంగా వస్తున్న గణేష్ రథయాత్రను (Ganesh Radha Yatra) ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మండపాల నిర్వాహకులు భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయాలని సూచించారు. శాంతియుత వాతావరణంలో ముందుకు కదలాలని పేర్కొన్నారు.

    Ganesh immersion | 21 జతల ఎడ్లు..

    వినాయకుడి రథానికి 21 జతల ఎడ్లను కట్టారు. దుబ్బ చౌరస్తాలో మున్నూరు కాపు సంఘం వినాయకుడిని మొదటగా రథంలో ఎక్కించారు. దుబ్బా చౌరస్తా నుంచి లలితా మహాల్ థియేటర్ (Lalita Mahal Theatre), గంజ్(Gunj)​, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్(Nehru Park), పవన్ థియేటర్, అహ్మదీ బజార్, గాజుల్​పేట్​, పెద్ద బజార్, గోల్ హన్మాన్​, వినాయక్ నగర్​లోని వినాయకుల బావి వరకు కొనసాగనుంది.

    Ganesh immersion | పోలీసుల ఆధీనంలో నగరం..

    నగరంలోని గణేశ్​ నిమజ్జన శోభాయాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 1300 మంది పోలీసులతో పర్యవేక్షణ చేస్తున్నారు. శోభాయాత్ర రూట్​ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెట్టారు. వైద్య, విద్యుత్​శాఖలతో పాటు ఇతర శాఖల సిబ్బంది సమన్వయంతో యాత్రలో విధుల్లో ఉన్నారు.

    More like this

    Ganesh Laddu | గణేశ్​ మండపాల వద్ద లడ్డూ వేలంపాటలు.. ఉత్సాహంగా పాల్గొంటున్న భక్తులు

    అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: Ganesh Laddu | ఉమ్మడిజిల్లాలో వినాయక నిమజ్జనాలు (Vinayaka nimajjanam) భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా...

    Kamareddy | బైబై గణేశా..కామారెడ్డిలో కొనసాగుతున్న గణేశ్​ నిమజ్జనోత్సవం

    అక్షరటుడే, కామారెడ్డి :  Kamareddy | కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 9:30...

    Collector Nizamabad | కలెక్టరేట్​లో పాలనాధికారి ఆకస్మిక తనిఖీలు

    అక్షరటుడే, ఇందూరు : Collector Nizamabad | ఐడీవోసీలోని పలు శాఖలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay...