అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ganesh Utsav | గణేశ్ నవరాత్రులను (Ganesh Navaratri) ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ప్రతిఒక్కరూ సహకరించాలని ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి (CI Raja Reddy) కోరారు. గణేశ్ ఉత్సవ నిర్వాహకులతో పట్టణంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు తమ వివరాలు స్థానిక పోలీస్స్టేషన్లలో (local police stations) నమోదు చేయించాలన్నారు. అలాగే గణేశ్ విగ్రహాల నిమజ్జన సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను వివరించారు. సమావేశంలో ఎస్సై మహేశ్, పోలీస్ సిబ్బంది, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Ganesh Utsav | గాంధారిలో..
అక్షరటుడే గాంధారి: గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని గాంధారి ఎస్సై ఆంజనేయులు (Gandhari SI Anjaneyulu) సూచించారు. మండలంలోని బృందావనం ఫంక్షన్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో (peace committee meeting) ఎస్సై మాట్లాడారు. వినాయక చవితి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. ప్రతి ఒక్క యూత్ సభ్యుడు బాధ్యతాయుతంగా వ్యవహరించారు. నిమజ్జనం సమయంలో ఆయా సంఘాలకు కేటాయించిన సీరియల్ నంబర్లతో వెళ్లాలన్నారు. గణేష్ మండపాల నిర్వాహకుల ఫోన్ నెంబర్లతో పాటు పూర్తి వివరాలు ఇవ్వాలని తెలిపారు. శాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో యూత్ల సభ్యులు, కుల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.