అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Vinayaka Chavithi | గణేష్ మండళ్లు, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు తప్పనిసరిగా పోలీసుల సూచనలు పాటించాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
మండపాలను విద్యుత్ లైన్ల (Power Lines) కింద, ట్రాన్స్‌ఫార్మర్లకు దగ్గరగా ఏర్పాటు చేయవద్దని సీపీ సూచించారు. మండపాల్లో ఎర్త్ లీకేజీ సర్క్యూట్ బ్రేకర్ (ఈఎల్సీబీ) (Earth Leakage Circuit Breaker) అవసరమైన ఎంసీబీఎస్ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మండపాల వైరింగ్‌ను లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషియన్ ద్వారానే పూర్తి చేయాలని సూచించారు. వైరింగ్‌లో ఎక్కడా జాయింట్లు లేకుండా చూసుకోవాలని వివరించారు.
Vinayaka Chavithi | సర్వీసు కేబుల్స్‌కు హుకింగ్ చేయవద్దు..
సర్వీస్ కేబుల్స్ హుకింగ్ చేయరాదని, విద్యుత్ వైర్లు ఇనుప పైపులకు తగలకుండా చూడాలని సీపీ వివరించారు. వైర్లు నేలమీద వేయరాదని, తప్పనిసరిగా వేయాల్సివస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Vinayaka Chavithi | సరైన ఎర్తింగ్‌తో త్రీపిన్ ప్లగ్‌లు ఉపయోగించాలి
మండపాల నిర్మాణంలో ఇనుప పైపులు వాడితే వాటిని ఇన్సులేషన్ పదార్థంతో కవర్ చేయాలని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. సర్వీస్ వైర్ పోల్స్‌కు ఫిక్స్ చేసిన తర్వాత, సంబంధిత లైన్‌మన్ లేదా జేఎల్ఎం అనుమతి లేకుండా మార్పులు చేయవద్దని సూచించారు. ఇన్వర్టర్ లేదా జనరేటర్ వాడితే రిటర్న్ కరెంట్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సూచించారు.
