ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | ప్రశాంత వాతావరణంలో గణేశ్​ నిమజ్జనాన్ని జరుపుకోవాలి

    Nizamabad City | ప్రశాంత వాతావరణంలో గణేశ్​ నిమజ్జనాన్ని జరుపుకోవాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | భక్తులు శాంతియుత వాతావరణంలో వినాయకుడి ఉత్సవాలు జరుపుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (Mla Dhanpal) అన్నారు.

    నిజామాబాద్​ నగరంలో మంగళవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో (CP Sai Chaitanya) కలిసి గణేశ్​ శోభాయాత్ర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.

    Nizamabad City | సమన్వయంతో పనిచేయాలి

    ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మండలి సభ్యులు భక్తి భావంతో శాంతియుత వాతావరణంలో శోభాయాత్రలో పాల్గొనాలని పేర్కొన్నారు. అనంతరం వినాయక్ నగర్​లోని (Vinayak Nagar) వినాయకుల బావి వద్ద ఏర్పాట్లను సమీక్షించారు.

    Nizamabad City | యంచ వద్ద నిమజ్జన ఏర్పాట్లు పరిశీలన..

    జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుండగా, భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే యంచ శివారులోని గోదావరి బ్రిడ్జి వరకు గల మార్గాన్ని కలెక్టర్​, సీపీ సంయుక్తంగా పరిశీలించారు. చెడిపోయి ఉన్న రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని పంచాయతీరాజ్, ఆర్​అండ్​బీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఉమ్మెడ మార్గాన్ని, బ్రిడ్జి వద్ద గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు.

    Nizamabad City | గజ ఈతగాళ్లు.. క్రేన్లు..

    యంచ గోదావరి బ్రిడ్జితో పాటు, ఉమ్మెడ వద్ద భారీ విగ్రహాల నిమజ్జనం కోసం సరిపడా క్రేన్లను, తగిన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కలెక్టర్​, సీపీ సిబ్బందికి సూచించారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, జనరేటర్, అంబులెన్స్​, మెడికల్ క్యాంప్​లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

    నిమజ్జనోత్సవంలో ఏ చిన్న అపశ్రుతి జరగకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్ కుమార్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిఘ్యాన్​ మాల్వియా, భైంసా డివిజన్ సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, నిజామాబాద్​ అదనపు డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నగర పాలక సంస్థ (Nizamabad Municipal corporation) కమిషనర్ దిలీప్ కుమార్, ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, మస్తాన్ రావు, మున్సిపల్, ఆర్​అండ్​బీ, అగ్నిమాపక, ఫిషరీస్, పంచాయతీరాజ్, రెవెన్యూ తదితర శాఖల అధికారులున్నారు.

    More like this

    Donald Trump | హ‌మాస్‌కు ట్రంప్ అల్టీమేటమ్‌.. బందీల‌ను విడుద‌ల చేయాల‌ని డిమాండ్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌(Hamas)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...

    NH 44 | నేషనల్​ హైవేపై ట్రక్కులో చెలరేగిన మంటలు

    అక్షరటుడే, ఇందల్వాయి : NH 44 | జాతీయ రహదారి(National Highway)పై ట్రక్కులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన...

    IPO | ఈ వారంలోనూ ఐపీవోల జాతర.. పబ్లిక్‌ ఇష్యూకు పది కంపెనీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | దేశీయ స్టాక్ మార్కెట్‌లో పబ్లిక్ ఇష్యూల(Public issues) జాతర కొనసాగుతోంది. ఈ...