Homeజిల్లాలునిజామాబాద్​Ganesh immersion | బాసర, ఉమ్మెడకు కదులుతున్న వినాయక విగ్రహాలు.. నిమజ్జనానికి పకడ్బందీ చర్యలు

Ganesh immersion | బాసర, ఉమ్మెడకు కదులుతున్న వినాయక విగ్రహాలు.. నిమజ్జనానికి పకడ్బందీ చర్యలు

- Advertisement -

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Ganesh immersion : గణేశ్ నవరాత్రులు ముగిశాయి. నిమజ్జనానికి వినాయక విగ్రహాలు నిన్నటి (శనివారం) నుంచే శోభాయమానంగా కదులుతున్నాయి.

నిజామాబాద్​ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాసర Basara, ఉమ్మెడ Ummeda వద్దకు నిమజ్జనం కోసం భక్తులు విగ్రహాలతో తండోపతండాలుగా వస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయా చోట్ల ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య Nizamabad Police Commissioner P. Sai Chaitanya తెలిపారు.

నిమజ్జనం జరిగే ప్రదేశాలను పోలీస్ కమిషనర్ సందర్శించారు. అక్కడ ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీసుల సూచనలను ఉత్సవ కమిటీ సభ్యులు పాటించాలని విజ్ఞప్తి సీపీ చేశారు.

పోలీసు సూచనలకు అనుగుణంగా నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకొని ప్రశాంతంగా వినాయక నిమజ్జనం పూర్తయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ CP తెలిపారు.

Ganesh immersion | బాసర, ఉమ్మెడకు కదులుతున్న వినాయక విగ్రహాలు.. నిమజ్జనానికి పకడ్బందీ చర్యలు
Ganesh immersion | బాసర, ఉమ్మెడకు కదులుతున్న వినాయక విగ్రహాలు.. నిమజ్జనానికి పకడ్బందీ చర్యలు

Ganesh immersion : సీసీ కెమెరాల పర్యవేక్షణలో..

జిల్లాలోని అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో గణేష్ నిమజ్జన ఊరేగింపు పూర్తి చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. ఊరేగింపు సమయంలో డీజేలు, బాణాసంచా కాల్చడం నిషేధమని స్పష్టం చేశారు.

ముఖ్యంగా ఉత్సవ కమిటీ సభ్యులు బాధ్యతగా నియమ నిబంధనలు పాటిస్తూ పోలీసు సూచనలను పాటించాలని కోరారు.

భక్తిశ్రద్ధలతో నవరాత్రులను ముగించుకొని ఆఖరున జరిగే నిమజ్జన కార్యక్రమాన్ని మత సామరస్యంతో, శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మొత్తంలో బాసర, ఉమ్మెడ కు నిమజ్జనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా.. రద్దీగా ఉండే ప్రదేశాలలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు సీపీ తెలిపారు.

Must Read
Related News