అక్షరటుడే, బాన్సువాడ: Ganesh immersion | బాన్సువాడ నియోజకవర్గంలో (Banswada Constituency) వినాయక నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.
ఈ సందర్భంగా గణేశ్ మండళ్ల వద్ద లడ్డూ వేలంపాటలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని పద్మశాలి సంఘం (Padmashali Sangham) గణేశ్ మండలి, స్వర్ణకార గణేశ్ మండలి (Swarnakaara Ganesh Mandali) వద్ద ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి (Mla pocharam) పూజల్లో పాల్గొన్నారు. చిన్నారులు, మహిళలతో కోలాటాలు ఆడారు. అనంతరం ఆయన శోభాయాత్రలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు(Agro Industries Chairman Kasula Balaraj, ) పాల్గొన్నారు.
Ganesh immersion | పోలీసుల ఏర్పాట్లు
పట్టణంలో గణేశ్ నిమజ్జనానికి పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిమజ్జనయాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. యాత్రకు అడుగడుగునా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. నిమజ్జన యాత్ర శాంతియుతంగా సాగుతోంది.