Homeభక్తిPakistan | పాకిస్తాన్‌లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. కరాచీ వీధుల్లో విఘ్నేశ్వరుడి వైభవ యాత్ర

Pakistan | పాకిస్తాన్‌లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. కరాచీ వీధుల్లో విఘ్నేశ్వరుడి వైభవ యాత్ర

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Pakistan | పాకిస్తాన్‌లోని హిందూ మైనారిటీలు భక్తిశ్రద్ధలతో వినాయక చవితిని ఘనంగా జరుపుకున్నారు. కరాచీ నగరంలో గణేశ నవరాత్రి ఉత్సవాలు(Ganesha Navratri Celebrations) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాల చివరిరోజు నిమజ్జనానికి వినాయక విగ్రహాన్ని ఓ ఆటోపై అలంకరించి, శోభాయాత్రగా ఊరేగించారు.

ఈ వినాయక ఊరేగింపు నగర వీధుల్లో సాగుతుండగా, భక్తులు “గణపతి బప్పా మోరియా” అంటూ నినాదాలు చేస్తూ, సంప్రదాయ డోల్లు వాయిద్యాల మధ్య నృత్యాలు చేశారు.వీధుల్లో హిందువుల భక్తిశ్రద్ధను చూసిన పలువురు స్థానిక ముస్లింలు కూడా ఆ ఊరేగింపును ఆసక్తిగా తిలకించారు. పాకిస్తాన్(Pakistan) గడ్డపై ఇలాంటి సాంస్కృతిక విభిన్నత హిందువుల‌ని ఎంత‌గానో క‌ట్టిప‌డేస్తుంది.

Pakistan | ఇది క‌దా…

ప్ర‌స్తుతం ఊరేగింపుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు.ఇదే నిజమైన ధర్మం, శాశ్వతమైన సంస్కృతి మన్నింపుగా ముందుకెళ్తున్న దృశ్యం” అంటూ ఒకరు కామెంట్ చేశారు. దాయాది దేశం పాకిస్తాన్‌లో వినాయకుని నిమజ్జనం(Ganesh Immersion) జరుగుతుందంటే, అది ఎంతో గొప్ప విషయం” అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు. కరాచీలో హిందూ మైనారిటీ సమాజాలు ఐక్యంగా గణేశ పండుగను జరుపుకోవడం, సంప్రదాయాన్ని నిలబెట్టడం చూసి నెటిజన్లు ప్ర‌శంస‌ల జల్లు కురిపిస్తున్నారు. విఘ్నేశ్వరుడిని తల్లి గంగమ్మ ఒడికి చేర్చే యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నిండైన భక్తి, ఆనందంతో కనిపించారు.

ఈ ఘటన పాకిస్తాన్‌లో మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ, సాంస్కృతిక ఐక్యతకు అద్దం పడుతోంది. ఇక మ‌న ద‌గ్గ‌ర కూడా గ‌ణేష్ నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మాలు చాలా ఉత్సాహంగా జ‌రుగుతున్నాయి.ఈ సారి బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర పలికింది . రూ. 1,116తో వేలం ప్రారంభం కాగా లింగాల ధశరథ్ గౌడ్ రూ. 35లక్షలకు ద‌క్కించుకున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఆయన ఈ లడ్డూ కోసం పోటీ పడుతున్న క్ర‌మంలో గతేడాది రూ. 30లక్షలకు బాలాపూర్ లడ్డూ అమ్ముడుపోయిన విష‌యం తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by A M A R (@theamarparkash)