అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | వినాయక చవితి ఉత్సవాలకు మరికొద్ది రోజులే ఉన్నప్పటికీ, నగరంలో ఒక బొజ్జ గణపతి విగ్రహం ముందుగానే నిమజ్జనం(Ganesh Immersion) కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దోమలగూడ ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు ప్రతిష్ఠించేందుకు తీసుకువస్తున్న గణేష్ విగ్రహం రోడ్డుపై పడిపోయి ధ్వంసమైంది.
Hyderabad | ప్రమాదం తప్పింది..
వివరాల్లోకి వెళ్తే, దోమలగూడ(Domalaguda)కు చెందిన యువకులు సోమవారం ఘట్‌కేసర్ ప్రాంతంలో ఓ భారీ గణేశ్ విగ్రహాన్ని కొనుగోలు చేసి, తమ అపార్ట్‌మెంట్ వద్ద మండపంలో ప్రతిష్ఠించేందుకు వాహనంలో తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలో హిమాయత్‌నగర్‌లోని వీధి నం.5(Himayatnagar Street No.5)లో ఓ మూల మలుపు వద్ద విగ్రహం కేబుల్ వైరుకు తగిలి, ట్రక్కు మీద నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో గణపతి విగ్రహం(Ganapati Idol) కొంత భాగం ధ్వంసమవ్వగా, నిర్వాహకులు విగ్రహాన్ని వెంటనే పీపుల్స్ ప్లాజా వద్ద క్రేన్ సహాయంతో హుస్సేన్‌సాగర్(Hussain Sagar)లో నిమజ్జనం చేశారు.
ఈ ఘటనలో ట్రక్కుపై ఉన్న బీహార్‌కు చెందిన గోల్‌మార్ (వయసు 25) అనే యువకుడు కింద పడిపోవడంతో అతని ఎడమ కాలికు తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా, అటుగా వెళ్తున్న మూడు ద్విచక్ర వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో గణేశ్ విగ్రహాలను తరలించే సమయంలో బాధ్యతాయుతంగా, భద్రతా నియమాలను పాటిస్తూ వ్యవహరించాల్సిన అవసరం ఉందని అర్ధమైంది. విద్యుత్ తీగలు, తక్కువ ఎత్తులో ఉన్న కేబుళ్లు, మూల మలుపులు వంటి చోట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
హైదరాబాద్ మహానగరంతో పాటు దేశ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సిద్దమైంది. హైదరాబాద్ (Hyderabad)లో గణపతి నవరాత్రులు అనగానే మన అందరికి గుర్తుకువచ్చేది ఖైరతాబాద్ గణేష్… ప్రతి ఏడాది కూడా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.. ఖైరతాబాద్ బడా గణేషుడి నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధిస్తున్నారు.