ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Ganesh Immersion | గణేష్ శోభాయాత్రలో 1300 మంది సిబ్బందితో పటిష్ట భద్రత

    Ganesh Immersion | గణేష్ శోభాయాత్రలో 1300 మంది సిబ్బందితో పటిష్ట భద్రత

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Ganesh Immersion | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్​ (Nizamabad Police Commissionerate) పరిధిలో గణేష్​ నిమజ్జన శోభాయాత్రకు (Ganesh Nimajjana Shobhayatra) పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు.

    నిజామాబాద్(Nizamabad), ఆర్మూర్ (Armoor), బోధన్ (Bodhan) డివిజన్లలోని అన్ని గణేష్ నిమజ్జనోత్సవ శోభాయాత్రలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు. అన్ని డివిజన్ల పరిధిలో దాదాపు 1300 మందికిపైగా పోలీస్​ సిబ్బందిని నియమించి అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశామని సీపీ పేర్కొన్నారు. సీసీ కెమెరాల ద్వారా డ్రోన్ కెమెరాలతో (Drone cameras) పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. పోలీస్ సిబ్బందితో పాటు ఎక్సైజ్, ఫారెస్ట్​, ఎన్​సీసీ, ఎన్​ఎస్​ఎస్​ మొదలగు వారితో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

    Ganesh Immersion | శోభాయాత్రలో పాటించాల్సినవి ఇవే..

    నిమజ్జన ఊరేగింపులో ప్రజలంతా శాంతియుతంగా పాల్గొనాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ట్రాఫిక్ నియమాలను అందరూ పాటించాలని తెలిపారు. ఆడియో సిస్టమ్స్ నిర్ణీత స్థాయిలో ఉపయోగించాలన్నారు.

    Ganesh Immersion | డీజేలు పూర్తిగా నిషేధం..

    డీజేలను పూర్తిగా నిషేధించినట్లు సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఎటువంటి పుకార్లను నమ్మవద్దని సూచించారు. మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనడం తప్పని.. వారిపై కఠినచర్యలు తీసుకంటామని హెచ్చరించారు. అత్యవసర సమయంలో 100 డయల్, పోలీస్ కంట్రోల్ రూం 87126-59700, సంబంధిత పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించాలన్నారు.

    More like this

    Vinayaka Laddu | రికార్డు స్థాయి ధర పలికిన శ్రీ గణేశ్​ మండలి లడ్డూ.. ఏకంగా రూ. 1.65 లక్షల పైనే..

    అక్షరటుడే, ఇందూరు: Vinayaka Laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. నిజామాబాద్​ జిల్లాలో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...

    Silver Ring | బొటనవేలికి వెండి ఉంగరం ధరించారా.. లక్ష్మీదేవి వచ్చినట్టే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Silver Ring | ప్రతి ఒక్కరి జీవితంలో ఉంగరాలు ధరించడం ఒక సాధారణ ఆచారం. మనం...

    GST Reforms | వాహన కొనుగోలుదారులకు శుభవార్త.. ప్రముఖ కార్లపై భారీగా తగ్గింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | వాహన కొనుగోలుదారులకు శుభవార్త. ప్రముఖ సంస్థల కార్ల ధరలు భారీగా...