ePaper
More
    HomeతెలంగాణGanesh idol Controversy | హైదరాబాద్‌లో వివాదాస్పదంగా మారిన రేవంత్ రెడ్డి గణేశ్ విగ్రహం.. రాజాసింగ్...

    Ganesh idol Controversy | హైదరాబాద్‌లో వివాదాస్పదంగా మారిన రేవంత్ రెడ్డి గణేశ్ విగ్రహం.. రాజాసింగ్ ఫిర్యాదుతో తొల‌గింపు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ganesh idol Controversy | హైదరాబాద్ నగరంలో గణేశ్ నవరాత్రి వేడుకలు (Ganesh Navratri celebrations) ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హబీబ్ నగర్‌లో ఏర్పాటు చేసిన ఓ వినూత్న గణేశ్ విగ్రహం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ విగ్రహాన్ని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మత్స్యశాఖ ఫెడరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ ఏర్పాటు చేయగా, విభిన్నంగా తయారు చేసిన ఈ విగ్రహంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖాన్ని వినాయకుడి శిరస్సుగా ఉపయోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    Ganesh idol Controversy | రేవంత్ గణపతిగా..?

    షర్ట్, ప్యాంట్, షూ ధరించి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వేషధారణలో ఉన్న విగ్రహానికి వినాయకుడి తలను జోడించి, “తెలంగాణ రైజింగ్” అనే బ్యానర్లతో విగ్రహ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ వినూత్న వినాయక విగ్రహం నవరాత్రి సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచినా.. ఇది మతభావాలను దెబ్బతీసేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విగ్రహంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA T.Rajasingh), హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు (Hyderabad Police Commissioner) ఫిర్యాదు చేశారు. “రేవంత్ రెడ్డి ఎవరికైనా అభిమానంగా ఉండొచ్చు. కానీ ఆయన మాకు దేవుడు కాదు. గణపతి రూపంలో ఆయన్ను చూపించడం హిందువుల మనోభావాలను గాయపరుస్తుంది. దీనిని తక్షణమే తొలగించాలి,” అని డిమాండ్ చేశారు.

    మా అభ్యర్థన ప్రకారం.. మత సామరస్యం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని, విగ్రహానికి జరిపే పూజలు నిలిపివేయాలని, పోలీసులు వెంటనే స్పందించాలని కోరారు రాజా సింగ్ (Raja Singh). దీనిపై మెట్టు సాయికుమార్ వివరణ ఇచ్చారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషికి గణేశుని ఆశీస్సులు ఉండాలని ఈ వినూత్న విగ్రహం ఏర్పాటు చేశాం. గతంలో కూడా సినిమాల హీరోల రూపాల్లో విగ్రహాలు పెట్టాం.

    ఈసారి సీఎం రూపంలో పెట్టినంత మాత్రాన తప్పు కాదు,” అని అన్నారు. అలాగే, ఈ విగ్రహానికి భక్తులు విశేషంగా స్పందిస్తున్నారని, కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఇది తమ అభిమానం, అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విగ్ర‌హం వివాదాస్ప‌దం అవుతున్న నేప‌థ్యంలో సౌత్ వెస్ట్ డీసీపీ మండ‌పాన్ని సంద‌ర్శించి భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా వ్య‌వ‌హ‌రించొద్దంటూ హెచ్చ‌రించారు. దీంతో పోలీస‌లు ఆదేశాల మేర‌కు సాయి కుమార్ ఆ విగ్ర‌హాన్ని మరొకటి ప్రతిష్టించారు.

    Latest articles

    Family Benefit Card | ప్రతి కుటుంబానికి ..ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్.. సంక్షేమ పథకాలపై చంద్రబాబు కీల‌క నిర్ణ‌యం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Family Benefit Card | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి ప్ర‌భుత్వం నూతన పథకాల అమలుకు కీలక...

    Gandhari Police | వాగులో కొట్టుకుపోతున్న మహిళ.. కాపాడిన ఎస్సై

    అక్షరటుడే/గాంధారి: Gandhari Police | వాగులో కొట్టుకుపోతున్న ఓ మహిళను ఎస్సై అతికష్టం మీద కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.....

    Heavy Rains | కామారెడ్డికి సీఎం రేవంత్​ రెడ్డి.. వరద ప్రభావంపై సమీక్షించనున్న ముఖ్యమంత్రి

    అక్షరటుడే, కామారెడ్డి​ : Heavy Rains | కామారెడ్డి జిల్లాను అతి భారీ వర్షాలు(Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ఒక్క...

    Schools holiday | భారీ వర్షాలు.. మరో రెండు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Schools holiday | కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు(Heavy Rains) తీవ్రంగా అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి...

    More like this