అక్షరటుడే, ఎల్లారెడ్డి: Vinayaka Chavithi | నియోజకవర్గంలో గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఆర్డీవో పార్థ సింహారెడ్డి (RDO Partha Simha Reddy) అన్నారు.
ఆర్డీవో కార్యాలయంలో (RDO Office) శుక్రవారం గణేష్ ఉత్సవాలపై ప్రభుత్వ శాఖలు, పొలిటికల్ పార్టీలు, మత పెద్దల ప్రతినిధులతో పీస్ కమిటీ సమావేశం (Peace Committee Meeting) నిర్వహించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై హిందూ, ముస్లిం ప్రతినిధుల అభిప్రాయాలు, సూచనలను ఆర్డీవో స్వీకరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గణేశ్ ఉత్సవాలు సామాజిక సమైక్యతకు ప్రతీకగా నిలవాలని, ప్రతిఒక్కరూ స్నేహపూర్వకంగా పండుగ జరుపుకోవాలని కోరారు. ప్రజల ఆచార సంప్రదాయాలకు భంగం కలగకుండా ఉత్సవాలు జరగాలని ఆయన సూచించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రాజిరెడ్డి, తహశీల్దార్ ప్రేమ్ కుమార్, ఎస్సై బొజ్జ మహేష్, మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్, ఫైర్ అధికారి వినోద్, వివిధ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.