HomeUncategorizedGanesh Chaturthi | గణేశ్ చతుర్థి వేడుకల జోష్.. నైజీరియాలో ‘దేవ శ్రీ గణేశ’కు అదిరిపోయే...

Ganesh Chaturthi | గణేశ్ చతుర్థి వేడుకల జోష్.. నైజీరియాలో ‘దేవ శ్రీ గణేశ’కు అదిరిపోయే డ్యాన్స్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ganesh Chaturthi | భారతదేశంలో (India) అత్యంత విశిష్ట పండుగలలో ఒకటైన గణేశ్ చతుర్థిను (Ganesh Chathurti) ఇప్పుడు దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నైజీరియా (Nigeria) దేశానికి చెందిన విద్యార్థులు బాలీవుడ్ హిట్ సాంగ్ ‘దేవ శ్రీ గణేశ’(Deva Shree Ganesha)కు చేసిన నృత్య ప్రదర్శన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పశ్చిమ ఆఫ్రికాలోని (West Africa) నైజీరియాకు చెందిన డ్రీమ్ క్యాచర్స్ అకాడమీ అనే నృత్య సంస్థకు చెందిన విద్యార్థులు 2012లో విడుదలైన ‘అగ్నిపథ్’ సినిమా సాంగ్‌కు ఉత్సాహంతో, ఎనర్జీతో నర్తించారు. ఈ డాన్స్ వీడియోను వారి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా @dreamcatchersda లో ఆగస్టు 19న షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 1.2 మిలియన్ వ్యూస్, 36 వేలకుపైగా లైకులు వచ్చాయి.

Ganesh Chaturthi | అల‌రించారు…

గణపతి పాటకు విదేశీ విద్యార్థులు చేసిన ఈ డ్యాన్స్ భార‌తీయ సంస్కృతి, భ‌క్తిని ప్ర‌తిబింబిస్తుంది. ఈ పిల్లల హావభావాలు, కదలికలు చూస్తే వారు భారతీయులేనేమో అనిపించే స్థాయిలో ఉన్నాయి. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒక యూజర్ కామెంట్ చేస్తూ.. “మీరందరూ భారతదేశం గర్వపడేలా చేసారు అని రాసుకొచ్చారు. మరో యూజర్.. మా దేశాన్ని గౌరవించినందుకు మీకు సెల్యూట్ అని, ఇంకొకరు అద్భుతమైన కొరియోగ్రఫీ, అద్భుతమైన నృత్యం… అసలైన సామరస్యం అని కామెంట్ చేశారు.

వైర‌ల్ అవుతున్న వీడియో భారతీయ సంస్కృతి (Indian culture) భౌగోళిక పరిమితులను దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రజల మనసులను గెలుస్తోంది. భక్తితో కూడిన‌ ఈ నృత్య ప్రదర్శన చూస్తే భారతీయులుగా మనము గర్వపడకమానం. ఇటీవలి కాలంలో చాలా మంది విదేశీయులు ఇలాంటి ప‌ర్‌ఫార్మెన్స్‌లు చేస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో (Social media) తెగ సంద‌డి చేస్తుంది.