Homeతాజావార్తలుSrikanth Bharat | గాంధీ స్వాతంత్య్రం తేలేదు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు

Srikanth Bharat | గాంధీ స్వాతంత్య్రం తేలేదు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు

తెలుగు నటుడు శ్రీకాంత్​ భరత్​ మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎక్స్​లో పోస్ట్​ చేసిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srikanth Bharat | మహాత్మా గాంధీపై టాలీవుడు నటుడు శ్రీకాంత్ భరత్​ (Actor Srikanth Bharat) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్​లో పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు.

శ్రీకాంత్​ మాట్లాడుతూ.. దేశానికి గాంధీ స్వాతంత్య్రం తేలేదన్నారు. ఇటీవల గాంధీ జయంతి (Gandhi Jayanti) సందర్భంగా ఆయన పెట్టిన పోస్ట్​కు వచ్చిన కామెంట్లపై స్పందిస్తూ సోమవారం శ్రీకాంత్​ ఎక్స్​లో వీడియో పోస్టు చేశారు. తాను ఏ పోస్ట్ పెట్టినా అనేక కామెంట్లు వస్తాయన్నారు. తాను వాటిని పట్టించుకోనని ఆయన పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా పోస్ట్​ పెడితే కొందరు విమర్శించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గాంధీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘గాంధీ ఎంతోమందని లైంగికంగా వేధించాడు. ఆయన స్వాతంత్య్రం తేలేదు. సుభాష్ చంద్రబోస్ (Subhash Chandra Bose), భగత్ సింగ్ (Bhagat Singh) వంటి ఎంతోమంది పోరాడితే స్వాతంత్య్రం వచ్చింది” అని అన్నారు.

Srikanth Bharat | నెటిజన్ల ఆగ్రహం

శ్రీకాంత్​ భరత్​ వీడియో సోషల్​ మీడియాలో (Social Media) వైరల్​గా మారింది. దీనిపై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాంధీపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. కాగా ఇటీవల రాహుల్​ రామకృష్ణ (Rahul Ramakrishna) సైతం గాంధీపై వివాదాస్పద పోస్టు చేశారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున, “గాంధీ సాధువు కాదు.. అసలు అతను మహాత్ముడే కాదు” అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తావిచ్చాయి. అనంతరం ఆయన అకౌంట్​ డిలీట్ చేసుకున్నారు.