అక్షరటుడే, వెబ్‌డెస్క్: Game Changer | ఆర్ఆర్ఆర్ సినిమాతో (RRR movie) పాన్ ఇండియా స్టార్‌గా మారిన రామ్ చరణ్ (Ram Charan) తన తదుపరి చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో చేశాడు. గేమ్ చేంజర్ చిత్రంతో (Game Changer film) ఈ మూవీ రూపొందింది. గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ (Game Changer Movie shooting) పలు కారణాల వల్ల లేటవుతూ రావడంతో ఫ్యాన్స్ కు సినిమాపై ఇంట్రెస్ట్ పూర్తిగా తగ్గిపోయింది. శంకర్ సినిమా అంటే ఈ తలనొప్పి సహజమనుకున్నారంతా. ఆఖరికి మూడేళ్ల తర్వాత సినిమా రిలీజైంది.భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా దిల్ రాజుకు (Dil raju) ఈ సినిమా ఆర్థికంగా చాలా నష్టాల్ని మిగిల్చింది. సినిమా ఫ్లాప్ అవ్వడం ఒక ఎత్తయితే, ఈ సినిమాకి అయిన వేస్టేస్ మరో ఎత్తు.
Game Changer | మూడు భాగాలు ఒకే సినిమాలో..
శంకర్ సినిమా (Shankar Movie) అంటేనే కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిర్మాతలు ఫిక్సయిపోతారు. ‘గేమ్ ఛేంజర్’ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమా ఫుటేజ్ (Movie footage) ఏకంగా ఏడున్నర గంటలు వచ్చిందట. ఈ విషయం బయటివాళ్లు చెబితే అంతగా నమ్మేవాళ్లు కాదు జనాలు. స్వయంగా ఈ సినిమాకు ఎడిటర్ గా పని చేసిన షమీర్ మహమ్మద్ రన్ టైమ్ గురించిన ఆసక్తికరమైన విషయాన్ని మీడియాతో పంచుకొన్నారు. శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాను (Shanker Game Changer Movie) ఏకంగా ఏడున్నర గంటల నిడివితో తీశాడట. ఆ విషయాన్ని ఆ సినిమాకు ఎడిటర్ గా వర్క్ చేసిన షమీర్ మహమ్మద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు సినిమాకు సంబంధించిన ఫైనల్ రష్ దాదాపు ఏడున్నర గంటలు వచ్చిందని, దాన్ని మూడు గంటలకు ఎడిట్ చేశానని చెప్పాడు.
కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల షమీర్ గేమ్ ఛేంజర్ (Game Changer) నుంచి తప్పుకోగా, ఆ తర్వాత మరో ఎడిటర్ దాన్ని మరింత ట్రిమ్ చేశాడు. షమీర్ చెప్పిన దాన్ని బట్టి శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాను మూడు సినిమాలకు సరిపోయో ఫుటేజ్ ను తీశాడంటే ఎడిటింగ్ లో (editing) ఎంత ఫుటేజ్ పోయిందో అర్థమవుతుంది. గేమ్ ఛేంజర్ రిలీజయ్యాక అందులో పని చేసిన చాలా మంది సినిమాలో మా సీన్స్ అన్నీ ఎడిటింగ్ లో కట్ చేశారని కూడా చెప్పారు. ఎడిటింగ్ లో నాలుగున్నర గంటల సినిమాను తీసేశారంటే ఈ సినిమాకు దిల్ రాజు తో (Dil raju) శంకర్ ఎంత బడ్జెట్ పెట్టి వేస్ట్ చేయించాడో అర్థం చేసుకోవచ్చు. థియేటర్లో ఓ పాటే లేకుండా పోయింది. అన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసిన పాటని కూడా థియేటర్లలో (Theaters) చూపించలేదంటే.. శంకర్ ఎంత నిర్లక్ష్యంగా ఈ సినిమా తీసి ఉంటాడో అర్ధమవుతుంది.