అక్షరటుడే, ఇందూరు: heavy rain : నిజామాబాద్ జిల్లా కేంద్రం(Nizamabad district headquarters)లో గాలీవాన బీభత్సం సృష్టించింది. సోమవారం రాత్రి ఒక్కసారిగా బలమైన ఈదురుగాలుల(strong gusts)తో కూడిన వాన జోరందుకుంది. చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలపై పడటంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా నగరం అంతా అంధకారం వ్యాపించింది.

నగరంలోని నాలుగో టౌన్ పరిధిలో పులాంగ్ అంగిటి ధాబా వెనుక కల్లు కాంపౌండ్ లో చెట్టు విరిగి పడటంతో ఒకరు మృతి చెందారు. వినాయక నగర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్(35) అక్కడ కూర్చుని కల్లు తాగుతున్న సమయంలో బలంగా వీచిన గాలి(strong winds)కి చెట్టు విరిగి అతడిపై పడటంతో అక్కడికక్కడే మరణించాడు.

నగరంలోని పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. స్తంభాలు నేలకొరిగాయి. కోటగల్లిలోని ఓ ఇంటిపై స్తంభం విరిగి పడింది. విద్యుత్తు తీగలు రోడ్లపై చెల్లాచెదురుగా పడి భయానక వాతావరణం సృష్టించాయి. గాలీవాన తగ్గుముఖం పట్టాక.. అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.