అక్షరటుడే, వెబ్డెస్క్: gali janardhan reddy : బళ్లారిలో మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై gali janardhan reddy హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు ఆయనపై కాల్పులు జరిపినట్లు సమాచారం. మొత్తం 8 రౌండ్ల వరకు కాల్పులు జరగగా ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.
అయితే గాలి జనార్ధన్ రెడ్డి మాత్రం ఈ కాల్పుల నుంచి తప్పించుకుని ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఎదురుకాల్పుల్లో సతీష్ రెడ్డి అనే వ్యక్తికి బుల్లెట్ గాయం అయినట్లు తెలుస్తోంది. గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి ప్రహరీ గోడకు ఫ్లెక్సీ కట్టడంపై తలెత్తిన వివాదమే ఈ హింసాత్మక ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
gali janardhan reddy : ఉద్రిక్తత..
బళ్లారి Ballari సర్కిల్లో జనవరి 3న వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉండటంతో ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో జనార్ధన్ రెడ్డి ఇంటి గోడకు కూడా ఫ్లెక్సీ కట్టే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగినట్లు సమాచారం.
ఈ గొడవలో కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడటంతో ఎమ్మెల్యే భరత్ రెడ్డి రాత్రి 9.30 గంటల సమయంలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆయన రాకతో అక్కడకు పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు, బీరు సీసాలతో దాడి చేసుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గొడవను నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు.
చివరికి జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు Police గాల్లోకి కాల్పులు జరిపిన తర్వాతే పరిస్థితి శాంతించింది. ఈ ఘటన అనంతరం గాలి జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డి, ఆయన కుమారుడు ఎమ్మెల్యే భరత్ రెడ్డికి నేర చరిత్ర ఉందని వ్యాఖ్యానించారు.
గత 25 ఏళ్లుగా వారు రౌడీయిజం చేస్తున్నారని, అలాంటి వారిని అడ్డుపెట్టుకుని ఉన్నప్పటికీ తాము బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చామని చెప్పారు. వారి చుట్టూ హత్యలు చేసిన గుండాలు తిరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన బళ్లారి రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.