అక్షరటుడే, ఇందూరు: Nizamabad city | జిల్లావ్యాప్తంగా గణేశ్ మండపాల (Ganesh Mandapalu) వద్ద గాజుల సంబరాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు గాజులు వేసుకుంటూ ఉత్సాహంగా ఆడిపాడారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నగరంలోని ఆనంద్‌నగర్ యువజన గణేశ్ మండలి (Anandnagar Youth Ganesh mandali) వద్ద శనివారం రాత్రి గాజుల సంబరం నిర్వహించారు. మహిళలంతా ఒకరికొకరు గాజులు వేసుకున్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కాలనీలో నెలకొల్పిన మల్టీ గ్రెయిన్ గణనాథుడిని నిమజ్జనం నిమిత్తం తరలించారు. ఈ కార్యక్రమంలో ఆనంద్‌నగర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
Nizamabad city | ముప్కాల్‌లో..
అక్షరటుడే, ముప్కాల్: మండల కేంద్రంలోని (Mupkal) జీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ముప్కాల్ పద్మశాలి సంఘం (Padmashali Sangham) ఆధ్వర్యంలో శనివారం గాజుల సవ్వడి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సంఘంలో గల మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొని ఒకరి చేతులకు మరొకరు గాజులు వేసుకున్నారు. ఆటపాటలతో అలరించారు. సంఘం అధ్యక్షుడు గోపాల్ మాట్లాడుతూ.. మహిళలు ఇలాంటి సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొని, కలిసికట్టుగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సెక్రెటరీ దినేష్, కోశాధికారి రవీందర్, అరుణ్, వెంకటరమణ, కమలాకర్త దితరులు పాల్గొన్నారు.