అక్షరటుడే, వెబ్డెస్క్ : Gadwal Fire Accident | జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది.
గద్వాల జిల్లా అయిజ (Ieeja) పట్టణంలోని పరమేశ్వర ఇండస్ట్రీస్ (Industrias Parameshwara) డ్రిప్ ఇరిగేషన్ ఫ్యాక్టరీలో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్లాస్టిక్ పరిశ్రమ కావడంతో ఫైర్ ఇంజిన్ వచ్చే సరికి సామగ్రి కాలిబూడిద అయింది. అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు.
Gadwal Fire Accident | షార్ట్ సర్క్యూట్తో..
పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్లాస్టిక్ డ్రిప్ పైపులు, ముడిసరుకు, యంత్రాలు పూర్తిగా కాలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు.
Gadwal Fire Accident | హైదరాబాద్లో..
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కేపీహెచ్బీ (KPHB)లో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కేపీహెచ్బీ బస్టాండ్ సమీపంలోని పద్మావతి ప్లాజాలో గల సాయి మొబైల్ షాపులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో దుకాణంలోని ఫోన్లు, సామగ్రి కాలిపోయాయి.