- Advertisement -
HomeతెలంగాణGaddar Film Awards | నేడే గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం.. ముఖ్య అతిథి ఎవరంటే..

Gaddar Film Awards | నేడే గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం.. ముఖ్య అతిథి ఎవరంటే..

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Gaddar Film Awards : తెలంగాణ(Telangana)లో 14 ఏళ్ల తర్వాత సినీ పురస్కార వేడుక జరుగబోతోంది. నేడే(జూన్​ 14) గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైటెక్స్(Hitex) వేదికగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఉండబోతోంది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హాజరుకానున్నారు.

Gaddar Film Awards : సీఎం అభినందనలు..

గద్దర్ ఫిలిం అవార్డులు అందుకోబోతున్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్ఠాత్మక ‘తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులు’ అందుకోబోతున్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులందరికీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

- Advertisement -

తెలంగాణ(Telangana) కళారంగంలో వేగుచుక్కలాంటివారైన గద్దర్ పేరిట వివిధ విభాగాల్లో సినిమా కళాకారులకు అవార్డులు అందించటం గర్వకారణమని పేర్కొన్నారు. 2014 నుంచి 2024 వరకు – తెలంగాణ ఏర్పడిన పదేళ్ల కాలానికి గాను ఉత్తమ సినిమాలకు అవార్డులు అందించటం, చలన చిత్ర వైతాళికుల పేరుతో ప్రత్యేక పురస్కారాలను ప్రకటించటం అభినందనీయమన్నారు. అవార్డుల ఎంపికలో జ్యూరీ సభ్యుల కృషిని ముఖ్యమంత్రి అభినందించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News