ePaper
More
    HomeతెలంగాణGaddar Film Awards | అట్ట‌హాసంగా గ‌ద్ద‌ర్ అవార్డుల వేడుక‌.. ఒకే ఫ్రేమ్‌లో సీఎం రేవంత్...

    Gaddar Film Awards | అట్ట‌హాసంగా గ‌ద్ద‌ర్ అవార్డుల వేడుక‌.. ఒకే ఫ్రేమ్‌లో సీఎం రేవంత్ రెడ్డి, బాలకృష్ణ, అల్లు అర్జున్

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Gaddar film awards : తెలంగాణ ప్రభుత్వం (Telangana government) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన‌ ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక అట్టహాసంగా జ‌రిగింది.

    హైదరాబాద్ హైటెక్స్​లో ఈ ఈవెంట్​ ఘనంగా జరుగ‌గా, ఈ ఈవెంట్​కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమాక్ర, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి Komatireddy venkatreddy, ఫిల్మ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్​రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2014 నుంచి 2024 వరకు ప్రభుత్వం ఇటీవల అవార్డులు ప్రకటించింది. ఒక్కో ఏడాదికి గానూ మూడు చొప్పున సినిమాలను విజేతలుగా ఎంపిక చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​కు ‘పుష్ప 2’ కు గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.

    Gaddar film awards : అట్ట‌హాసంగా వేడుక‌లు..

    ‘ఎన్టీఆర్ అవార్డ్​'(NTR Award)ను నందమూరి బాలకృష్ణకు దక్కింది. ఈ విజేతలకు తాజా కార్యక్రమంలో ప్రభుత్వం పురస్కారాలు అందించింది. అవార్డ్​తో పాటు క్యాష్ ప్రైజ్, ప్రశంసపత్రం కూడా ఇచ్చింది. ఈ అవార్డుల కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్(Allu Arjun), విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హాజరయ్యారు. బాలయ్య Balakrishna సంప్రదాయ దుస్తుల్లో రాగా, బన్నీ బ్లాక్ అండ్ బ్లాక్ స్యూట్​లో మెరిశారు. ఉత్తమ నటుడిగా బన్నీ, ఎన్టీఆర్ అవార్డ్ పురస్కారాన్ని బాలయ్య అందుకున్నారు.ఈ అవార్డుల ప్రదానోత్సవ వేడుకకు యావత్ సినీ పరిశ్రమ తరలి వచ్చింది.

    ఈ వేడుకలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పక్కపక్కన కూర్చుని చాలా సరదాగా ముచ్చటించారు. వారి పక్కన సీఎం రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భట్టి విక్రమార్క (Deputy Chief Minister Bhatti vickramakra), మంత్రి కోమటిరెడ్డి (Cinematography Minister Komatireddy Venkatreddy), దిల్ రాజు (Film Development Corporation Chairman Dil Raju) జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

    అనేక మంది ఆర్టిస్ట్​లు ఆటపాటలతో అలరించారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి Keeravani తన టీమ్ మెంబర్స్​లో ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని ఆలపించారు. సినీనటులతో హైటెక్స్ ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది. బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు, నటుడు విజయ దేవరకొండకు కాంతారావు ఫిలిం అవార్డు, మణిరత్నంకు పైడి జయరాజ్ ఫిలిం అవార్డు, సుకుమార్‌కు బీఎన్‌రెడ్డి ఫిలిం అవార్డు, అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిలిం అవార్డు, యండమూరి వీరేంద్రనాథ్‌కు రఘుపతి వెంకయ్య ఫిలిం అవార్డు, ప్రజాకవి కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డు అందించారు.

    సినీ సెలబ్రిటీలతో గద్దర్ అవార్డ్స్ వేదిక కళకళలాడింది. మణిరత్నం, సుహాసిని, మురళీ మోహన్, జయసుధ, జయప్రద, అల్లు అర్జున్, నందమూరి బాలకృష్ణ, విజయ్ దేవరకొండ.. తదితరులు ఈ వేడుకలో మెరిశారు. ఇక తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటరెడ్డి వెంకట రెడ్డి, FDC ఛైర్మెన్ దిల్ రాజు టెక్నీషియన్స్ కు అవార్డులను ప్రదానం చేయడమే కాకుండా వారికి రూ.5 లక్షలు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ అవార్డుల ప్రదానోత్సవంతో సినీ పరిశ్రమకు చెందిన పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అవార్డులను గెలుచుకున్న వారికి మాత్రమే కాకుండా ఈ అవార్డులను ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్ కి కూడా గద్దర్ అవార్డు ఇచ్చి సత్కరించారు. జ్యూరీ మెంబర్స్ కి గోల్డెన్ మెమెంటోతో పాటు పారితోషికం ఇచ్చారు.

    అవార్డులను ఎంపిక చేసిన జ్యూరీ మెంబెర్స్.. నటుడు మురళి మోహన్ Murali Mohan, డైరెక్టర్ దశరథ్, నిర్మాత డీవీకే రాజు, నటి ఊహ, ఉమా మహేశ్వరరావు, వనజ ఉదయ్, కూచిపూడి వెంకట్, నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, నటి జయసుధ, విజయ్ కుమార్ రావు, జర్నలిస్ట్ లక్ష్మి నారాయణ, శ్రీనాథ్, డా. ఆకునూరి గౌతమ్, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, డైరెక్టర్ శివ నాగేశ్వరరావు, డైరెక్టర్ విఎన్ ఆదిత్య, జర్నలిస్ట్ వెంకట రమణ జీవి, నిర్మాత రాజా ఉన్నారు. అలాగే వీరితో పాటు పుస్తకాలకు సంబంధించిన అవార్డుల ఎంపికలో జ్యూరీ మెంబర్స్ అయిన భగీరథ ఉత్తమ, వడ్లమాని కనకదుర్గ, మధుసూదన్, డా.హరీష్ TFDC ఎండి, విజయలక్ష్మిలకు కూడా అవార్డులు అందించారు.

    Latest articles

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షరటుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని, ఐపీ...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    More like this

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షరటుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని, ఐపీ...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...