Homeజిల్లాలుకామారెడ్డిTPCC | టీపీసీసీ జనరల్ సెక్రెటరీగా గడ్డం చంద్రశేఖర్​ రెడ్డి

TPCC | టీపీసీసీ జనరల్ సెక్రెటరీగా గడ్డం చంద్రశేఖర్​ రెడ్డి

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: TPCC | తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కామారెడ్డికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి స్థానం దక్కింది. ఆయనను టీపీసీసీ జనరల్ సెక్రెటరీగా నియమిస్తూ ఏఐసీసీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం నిజాంసాగర్​ చౌరస్తాలో సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకుడు గడ్డం సురేందర్​ రెడ్డి, మాజీ కౌన్సెలర్లు పాత శివ కృష్ణమూర్తి, చాట్ల వంశీకృష్ణ, నాయకులు పంపరి శ్రీనివాస్​, సలీం తదితరులు పాల్గొన్నారు.

TPCC | బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లోకి..

గడిచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్​లో కొనసాగిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి దంపతులను పార్టీలో వివాదాల కారణంగా సస్పెండ్ చేశారు. దాంతో నాటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారిరువురు కాంగ్రెస్​లో చేరారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్మన్ నిట్టు జాహ్నవిపై అవిశ్వాసం నెగ్గడంతో పార్టీ నాయకత్వం గడ్డం ఇందుప్రియకు ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. పాలకవర్గం పదవీకాలం పూర్తి కావడంతో ఇందుప్రియ భర్తకు టీపీసీసీలో అవకాశం దక్కింది.

జిల్లా కేంద్రంలో కేక్​కట్​ చేస్తున్న కాంగ్రెస్​ శ్రేణులు