అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ravindra Jadeja | తొలి టెస్ట్ కోల్పోయిన భారత జట్టు రెండో టెస్ట్‌లో పట్టు బిగించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా(Team India) భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం అద్భుతమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్ టాప్-3 బ్యాటర్లను ఔట్ చేయడంతో ఇప్పుడు మ్యాచ్ మంచి మజా అందించే అవకాశం ఉంది.. క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్(30 బ్యాటింగ్), జో రూట్(18 బ్యాటింగ్) కాస్త ఆచితూచి ఆడడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 77 పరుగులు చేసింది. ఇక బుమ్రా స్థానంలో వచ్చిన ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(Mohammed Siraj) ఓ వికెట్ పడగొట్టాడు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ జట్టు.. రెగ్యులర్ బజ్‌బాల్ గేమ్‌ను పక్కన పెట్టి జిడ్డు బ్యాటింగ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది.
Ravindra Jadeja | నవ్వులే నవ్వులు..
అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఫన్నీ సంఘటన జరిగింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో, మహ్మద్ సిరాజ్ వేసిన రెండో ఓవర్‌లో జాక్ క్రాలీ షాట్‌కి ఫీల్డింగ్ చేసే క్రమంలో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) డైవ్ చేశాడు. డైవ్ సమయంలో జడేజా ప్యాంట్ జారిపోయింది, దాంతో మైదానంలో నవ్వుల వెల్లువ కురిసింది. ఆటగాళ్లు, కామెంటేటర్లు, ప్రేక్షకులు అందరూ ఆ హాస్యాస్పద ఘట్టాన్ని ఆస్వాదించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక బుమ్రా స్థానంలో వచ్చిన ఆకాశ్ దీప్ తన తొలి స్పెల్‌లోనే 2 బంతుల్లో 2 వికెట్లు తీసారు. బెన్ డకెట్ (0), ఓలీ పోప్ (0)లని పెవీలియన్‌కి పంపాడు. శుభ్‌మన్ గిల్(Shubman Gill), కేఎల్ రాహుల్(KL Rahul) అద్భుత క్యాచ్‌లతో వారు త్వరగానే పెవీలియన్‌కి చేరుకున్నారు.
ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు బ్యాటింగ్‌తో అదరగొట్టింది. 587 పరుగులకు ఆలౌట్ కాగా, శుభ్‌మన్ గిల్ 269 పరుగులు (30 ఫోర్లు, 3 సిక్సులు) రికార్డు డబుల్ సెంచరీ చేశాడు. ఇక ఆ తర్వాత జడేజా 89 పరుగులు, జైస్వాల్ 87 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 42 పరుగులు జట్టు భారీ స్కోరు చేయడంలో భాగమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్స్‌లో షోయబ్ బషీర్3/167, క్రిస్ వోక్స్ 2/81, జోష్ టంగ్ 2/119 రాణించారు. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ తలో వికెట్ తీశారు.
1 comment
[…] జడేజా (Ravindra Jadeja) భార్య రివాబా జడేజా శుక్రవారం […]
Comments are closed.