అక్షరటుడే, వెబ్‌డెస్క్: Funky trailer | విలక్షణమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ‘జాతిరత్నాలు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అనుదీప్.. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న కామెడీ ఎంట్రటైనర్ ‘ఫంకీ’. ఈ మూవీకి సంబంధించి ట్రైలర్‌ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
Funky trailer | సితార ఎంటర్టైన్మెంట్స్..
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ మూవీ రూపొందుతోంది. కాగా.. ఇప్పటికే సాంగ్స్‌తో పాటు టీజర్‌తో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. తాజాగా.. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే అనుదీప్ టేకింగ్, విష్వక్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు నవ్వులు పంచుతోంది. సినిమాను ప్రేమ, వినోదంతో కడుపుబ్బా నవ్వుకునేలా రూపొందించినట్లు ట్రైజర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో హీరోయిన్గా కయాదు లోహర్ నటిస్తున్నారు.
Funky trailer | ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు..
అనుదీప్ మార్క్ సెటైరికల్ కామెడీ.. విశ్వక్ సేన్ ఎనర్జీ కలిస్తే ‘ఫంకీ’ చిత్రం ఎలా ఉండబోతుందో ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. కాగా.. ఈ మూవీ ఫిబ్రవరి 13న ప్రేమికుల రోజు కానుకగా సినిమా థియేటర్లలో విడుదల కానుంది. మూవీ టీమ్ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద ‘ఫంకీ’ హంగామా ఎలా ఉంటుందో వేచి చూడాలి.
The Laughter fest of the year is here 😆#FunkyTrailer out now! 🤩https://t.co/KtxsjL0npu
Unlimited #Funky Entertainment in theatres from FEB 13th 🤗🤗#FunkyFrom13thFeb
Mass Ka Das @VishwakSenActor @11Lohar @anudeepfilm #BheemsCeciroleo @vamsi84 #SaiSoujanya @NavinNooli… pic.twitter.com/UTkRgpXvzK
— Sithara Entertainments (@SitharaEnts) February 7, 2026