అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | వేడివేడి కర్రీపఫ్ తిందామనుకుని బేకరీకి వెళ్లిన ఓ కస్టమర్‌కు షాక్ తగిలింది. పఫ్‌లు కొనుగోలు చేసి తినేందుకు ఓపెన్ చేయగా కుళ్లిపోయినవి కనిపించడంతో కంగుతిన్నాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పూలాంగ్ సమీపంలోని మినార్ బేకరీకి వెళ్లిన ఓ వినియోగదారుడు కర్రీ పఫ్‌లు (Curry Puff) ఆర్డర్ చేశాడు. అయితే వాటిని తిందామనుకునేలోపు దుర్వాసన రావడంతో తెరిచిచూడగా కర్రీపఫ్ పూర్తిగా కుళ్లిపోయి ఉంది. దీంతో దుకాణాదారుడికి ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెప్పడంతో పలువురు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
