HomeతెలంగాణWanaparthi | చనిపోయాడు అనుకొని అంత్యక్రియలకు ఏర్పాటు.. అభిమాన నాయకుడు పిలవగానే కదలిక

Wanaparthi | చనిపోయాడు అనుకొని అంత్యక్రియలకు ఏర్పాటు.. అభిమాన నాయకుడు పిలవగానే కదలిక

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Wanaparthi | ఓ వ్యక్తి టిఫిన్​ చేశాక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శరీరంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన చనిపోయాడు అనుకున్నారు.

వనపర్తి(Wanaparthi) పట్టణంలో పీర్లుగుట్టలో ఆదివారం వింత ఘటన చోటు చేసుకుంది. చనిపోయాడు అనుకున్న వ్యక్తి బతికాడు. పట్టణానికి చెందిన తైలం రమేశ్ (49)​ బీఆర్​ఎస్​ నాయకుడు, మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి(Former Minister Niranjan Reddy) వీరాభిమాని. తన ఛాతిపై అభిమాన నాయకుడు నిరంజన్​రెడ్డి చిత్రాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నాడు.

Wanaparthi | కదలిక లేకపోవడంతో..

రమేశ్​ పట్టణంలోని పీర్లుగుట్ట(Peerlugutta)లో గల తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం టిఫిన్​ చేశాక ఆయన అస్వస్థతకు గురయ్యాడు. శరీరంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో కుటుంబ సభ్యులు రమేశ్​ చనిపోయాడు అనుకున్నారు. ఈ మేరకు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. తన అభిమాని చనిపోయాడనే విషయం తెలుసుకున్న నిరంజన్​రెడ్డి ఆయన మృతదేహానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చారు.

Wanaparthi | పచ్చబొట్టును చూడగా..

రమేశ్​ తన ఛాతిపై గతంలో నిరంజన్​రెడ్డి పచ్చబొట్టు వేయించుకున్నారు. ఆయన రమేశ్​ ఇంటికి చేరుకొని మృతదేహానికి నివాళి అర్పించారు. ఈ క్రమంలో ఛాతిపై గల తన పచ్చబొట్టును చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో పచ్చబొట్టును పరిశీలిస్తుండగా.. రమేశ్​ ఊపిరి తీల్చుకుంటున్నట్లు ఆయన గమనించారు. వెంటనే పూలదండలు తీసేసి నిరంజన్​రెడ్డి రమేశ్​ను గట్టిగా పిలిచారు. దీంతో ఆయన కనురెప్పలు కదలిల్చారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. రమేశ్​ కళ్లు తెరిచాడు. దీంతో అతని కుటుంబం, బంధువులు ఇద్దరూ ఆనందంతో పాటు ఆశ్చర్యానికి గురయ్యారు.