అక్షరటుడే, ఇందూరు : MLA Dhanpal | జిల్లా కేంద్రంలో కళాభారతి నిర్మాణం కోసం పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Dhanpal Suryanarayana Gupta) డిమాండ్ చేశారు. నగరంలోని కళాభారతి భవనాన్ని బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం గత ప్రభుత్వ హయాంలో కళాభారతి (Kalabharti) నిర్మాణానికి శ్రీకారం చుట్టాలన్నారు. నిధుల లేమితో ఇప్పటికీ పనులు పూర్తికాలేదని తెలిపారు. కాంట్రాక్టర్కు గత ఏడాదిగా రూ.25 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉంచారన్నారు.
జిల్లాలో అనేకమంది కళాకారులు ఉన్నారని, వారి భవిష్యత్తు కోసం నిర్మాణ పనులు తొందరగా పూర్తయ్యేలా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. రాష్ట్రంలో నిధులు లేవనే కారణాన్ని చూపి బిల్లులను చెల్లించకుండా ఉండకూడదని కోరారు. పెండింగ్ బిల్లులతో పాటు అవసరమైన నిధులు కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిర్మాణం పూర్తయితే కళాకారులతో పాటు జిల్లా ప్రజలకు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ నాయకులు (BJP Leaders) ఇల్లెందుల ప్రభాకర్, ఆనంద్, కృష్ణ, పవన్ తదితరులు ఉన్నారు.
