అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy Town | రాష్ట్రంలోని ఏకోపాధ్యాయ పాఠశాలలకు (single-teacher schools) నిధులు మంజూరు చేయాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టీటీయూ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎండీ ముజీబొద్దీన్, ప్రధాన కార్యదర్శి కాంబ్లె గోపాల్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ పాండ్రె శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో 1–10 మంది విద్యార్థులున్న ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలకు మొదటి విడత 50 శాతం కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. నిధులు విడుదల చేసినట్లు ఉత్తర్వులు జారీ చేసినా.. పాఠశాలల ఖాతాల్లో నిధులు జమ కాలేదన్నారు. ఇప్పటికైనా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వెంటనే స్పందించి స్కూల్ గ్రాంట్‌ను విడుదల చేయాలని కోరారు.
