Homeజిల్లాలుకామారెడ్డిMla Laxmi Kantha Rao | జుక్కల్​లో రోడ్ల నిర్మాణానికి రూ.32 కోట్ల నిధులు మంజూరు

Mla Laxmi Kantha Rao | జుక్కల్​లో రోడ్ల నిర్మాణానికి రూ.32 కోట్ల నిధులు మంజూరు

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్: Mla Laxmi Kantha Rao | జుక్కల్​ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) పేర్కొన్నారు. గురువారం జుక్కల్​ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జుక్కల్​లో రోడ్ల పరిస్థతిని మంత్రికి వివరించారు.

Mla Laxmi Kantha Rao | 7న నియోజకవర్గానికి మంత్రి కోమటిరెడ్డి..

ఈ సందర్భంగా రోడ్ల పరిస్థితిని వివరించి నిధుల కోసం అడగగా మంత్రి వెంటనే స్పందించారని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. రూ.32.20 కోట్లు మంజూరు చేశారని వివరించారు. అలాగే రోడ్ల నిర్మాణ ప్రారంభోత్సవానికి ఈనెల 7న వస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ ప్రజల పక్షాన మంత్రికి ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కృతజ్ఞతలు తెలిపారు.

Must Read
Related News