అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | నియోజకవర్గంలో వరద బాధితులకు ( flood victims) ఆర్థిక సహాయం కింద నిధులు విడుదలైనట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని జీఆర్ కాలనీలో (GR Colony) 45 కుటుంబాలకు, కౌండిన్య కాలనీలో 22 కుటుంబాలకు మొత్తం 67 ఇళ్ల మరమ్మతుకు ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వం రూ.11,500 బాధితుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.
కామారెడ్డి పట్టణంలో (Kamareddy Town) పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు తక్షణ సహాయం కింద 67 కుటుంబాలకు రూ.4 వేల చొప్పున జమ చేస్తామన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో దాదాపు 60 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, వారికి కూడా రూ.4వేల చొప్పున అందిస్తామన్నారు. అలాగే ప్రభుత్వ శాసనమండలి కమిటీ, ప్రభుత్వ అధికారులు సర్వే చేసి పూర్తి వివరాలు పంపించిన తర్వాత నష్టపోయిన కుటుంబాలకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించి వారి కుటుంబాలను ఆదుకుంటామని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.