అక్షరటుడే, ఆర్మూర్: Armoor constituency | ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించినట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్ కుమార్‌రెడ్డి (Vinay Kumar Reddy) పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.
నియోజకవర్గంలో అభివృద్ధి పనుల విషయమై నిధులు మంజూరు చేయాలని పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డితో (CM Revanth Reddy) చర్చించినట్లు ఆయన గుర్తు చేశారు. స్పందించిన సీఎం యూఐడీఎఫ్ పథకంలో (UIDF Scheem) భాగంగా రూ.18.70కోట్లు మంజూరు చేశారని ఆయన పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి, మంజూరుకు కృషి చేసిన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వినయ్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

