Homeజిల్లాలుకరీంనగర్Bandi Sanjay | కరీంనగర్​లో రోడ్ల అభివృద్ధికి నిధులు.. ప్రధానికి బండి సంజయ్​ కృతజ్ఞతలు

Bandi Sanjay | కరీంనగర్​లో రోడ్ల అభివృద్ధికి నిధులు.. ప్రధానికి బండి సంజయ్​ కృతజ్ఞతలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bandi Sanjay | కరీంనగర్​ పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలో రోడ్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్​ (Union Minister Bandi Sanjay) తెలిపారు.

మానేరు నదిపై (Maneru river) హైలెవల్ వంతెనను నిర్మించాలన్న గన్నేరువరం ప్రజల దశాబ్దన్నర కల త్వరలోనే సాకారం కానుందని ఆయన తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.77కోట్ల నిధులను కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) మంజూరు చేశారని వెల్లడించారు.

Bandi Sanjay | రోడ్డు విస్తరణకు..

చొప్పదండి నియోజకవర్గంలోని ఆర్నకొండ గ్రామం నుంచి మల్యాల క్రాస్ రోడ్డు వరకు దాదాపు 35కి.మీ.ల మేర సింగిల్ రోడ్డును డబుల్ లేన్ మార్చనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ రోడ్డును విస్తరించడానికి సీఆర్ఐఎఫ్ పథకంలో (CRIF scheme) భాగంగా రూ.50కోట్లు మంజూరు చేశారన్నారు.

వేములవాడ నుండి సిరికొండ మార్గంలో 18.2 కి.మీ.ల మేర రోడ్డును నిర్మించడానికి రూ.23 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని చెప్పారు. కరీంనగర్ నుంచి నిజామాబాద్ (Karimnagar to Nizamabad) జిల్లాకు వెళ్లేందుకు ఈ మార్గంలో తక్కువ దూరం ఉంటుందని.. దీంతో రెండు జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని బండి సంజయ్​ తెలిపారు.

Bandi Sanjay | వికసిత్​ భారత్​ లక్ష్యంగా..

వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్న కేంద్ర ప్రభుత్వం (Central Government) దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచుతోందని కేంద్ర మంత్రి అన్నారు. అందులో భాగంగా తెలంగాణకు, ముఖ్యంగా కరీంనగర్​కు పెద్దపీట వేయడం ఎంతో అదృష్టమని చెప్పారు. కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి(సీఆర్ఐఎఫ్) కింద తెలంగాణకు మంజూరైన రూ.868కోట్ల నిధుల్లో ఏకంగా రూ.150 కోట్లను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేటాయించినందుకు ఆయన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు.

Must Read
Related News