ePaper
More
    HomeతెలంగాణKTR | నిధులు రాహుల్​గాంధీకి, నీళ్లు చంద్రబాబుకు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

    KTR | నిధులు రాహుల్​గాంధీకి, నీళ్లు చంద్రబాబుకు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | రాష్ట్రంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం నిధులు రాహుల్ గాంధీకి (Rahul Gandhi), నీళ్లు చంద్రబాబుకు (Chandra Babu) ఇస్తున్నట్లు మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) బుధవారం కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్ట్​ (Banakacherla Project) అంశం అసలు చర్చకు రాలేదని ఆయన పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్​ ట్విటర్​ వేదికగా స్పందించారు.

    ముసుగు వీడింది, నిజం తేటతెల్లమయ్యింది అని ఆయన విమర్శించారు. 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందన్నారు. నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి, తెలంగాణ వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు, బూడిద తెలంగాణ ప్రజలకు అని పేర్కొన్నారు. బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి, గురుదక్షిణగా గోదావరి జలాలను (Godavari River) అప్పజెప్పారని ఆరోపించారు. జై తెలంగాణ అనడానికి ఉన్న సిగ్గు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబుకి ధారపోయడానికి లేదా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    KTR | ఇక్కడే పాతిపెడతాం..

    “నీ గురువుపై విశ్వాసం చూపించడానికి తెలంగాణ విధ్వంసం కావలసిందేనా” అని కేటీఆర్​ పేర్కొన్నారు. ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పజెప్పినా, మరో పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమి, తరిమి కొడతామన్నారు. ప్రాంతం వాడు మోసం చేస్తే ఇక్కడే పాతి పెడతామని కేటీఆర్​ అన్నారు. తెలంగాణను పీక్కుతింటున్న రాబందుల పని పడతామని ఆయన పేర్కొన్నారు.

    More like this

    Eagle Team | ముంబైలో ఈగల్​ టీమ్​ స్పెషల్​ ఆపరేషన్​.. డ్రగ్స్​, హవాలా రాకెట్​ గుట్టురట్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eagle Team | ముంబైలో తెలంగాణ (Telangana) ఈగల్​ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టారు....

    Stock Market | నిలదొక్కుకునేనా? లాభాల బాటలో దేశీయ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | గ్లోబల్‌ మార్కెట్లు (Global markets) పాజిటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు...

    Mahalaya Paksham | మహాలయ పక్షం.. పితృదేవతలకు ప్రీతికరమైన కాలం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahalaya Paksham | భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న...