అక్షరటుడే, ఎల్లారెడ్డి: BC Reservations | బీసీ హక్కుల సాధన కోసం జరుగుతున్న ఉద్యమానికి పూర్తి మద్దతునిస్తున్నట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (MLA Madan Mohan Rao) పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో శనివారం నిర్వహిస్తున్న బీసీ బంద్‌కు (BC bandh) కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయాలని సూచించారు.
BC Reservations | వెనకడుగు వేసే ప్రసక్తే లేదు..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చేస్తున్న పోరాటంలో కాంగ్రెస్ పార్టీ (Congress party) ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బీసీల ఆధ్వర్యంలో చేస్తున్న బంద్‌తో కేంద్రానికి కనువిప్పు కలగాలని ఆయన పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ (Yellareddy constituency) పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
BC Reservations | బీసీ బంద్‌కు రాజకీయ పార్టీల మద్దతు
అక్షరటుడే, ఎల్లారెడ్డి: BC Reservations | రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల బిల్లును (BC reservation bill) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు బీసీ సంఘాలు మద్దతు పలికాయి. ఎల్లారెడ్డిలో నాయకులు ర్యాలీగా వెళ్లి దుకాణ సముదాయాలను బంద్ చేయించారు.
బీసీలకు 42 శాతరం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఎల్లారెడ్డికి వచ్చే వివిధ ఆర్టీసీ డిపోలకు చెందిన బస్సులు బంద్ సందర్భంగా రాకపోవడంతో ప్రైవేట్ వాహనాలలో ప్రయాణికులు ప్రయాణించారు. ప్రైవేట్ పాఠశాలలు (private schools) ముందస్తుగానే బంద్‌కు మద్దతు పలకడంతో బడులు మూతపడ్డాయి.
BC Reservations | రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం చేద్దాం
అక్షరటుడే, పెద్ద కొడప్గల్ : BC Reservations | బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేద్దామని విశ్రాంత గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కాశీనాథ్ దేశాయ్ అన్నారు. ఆయన శనివారం మండల కేంద్రంలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా, బంద్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ను శాసన సభలో ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రప్రభుత్వ ఆమోదం కోసం పంపడం జరిగిందని ఆయన తెలిపారు. బందోబస్తు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.