Homeజిల్లాలునిజామాబాద్​BC JAC | బీసీ రాష్ట్ర బంద్​కు సంపూర్ణ మద్దతు

BC JAC | బీసీ రాష్ట్ర బంద్​కు సంపూర్ణ మద్దతు

బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 18న తలపెట్టిన బంద్​కు మద్దతు ఇవ్వాలని సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు గంజ్​ వర్తక, దడ్వాయి, చాట అసోసియేషన్లను కలిసి విన్నవించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: BC JAC | బీసీ రాష్ట్ర బంద్​కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు గంజ్​ వర్తక, గుమస్తా సంఘం, దడ్వాయి సంఘం, హమాలీ సంఘం, చాటా సంఘం ప్రతినిధులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో (Agricultural Market Yard) గురువారం ఆయా సంఘాల నాయకులను బీసీ జేఏసీ నాయకులు కలిశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 18న తలపెట్టిన బీసీ బంద్​కు (Bc Bundh) పూర్తి మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. బీసీల పోరాటం న్యాయమని ఇందుకు అందరూ సహకరిస్తున్నారన్నారు. ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా బంద్ పాటించి తమకు మద్దతు తెలిపాలని కోరారు.

కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం (BC Sankshema Sangham) జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ (Narala Sudhakar), నాయకులు ఆంజనేయులు, దేవేందర్, శంకర్, చంద్రకాంత్, బాలన్న, చైతన్య, ఆయా సంఘాల ప్రతినిధులు శ్రీనివాస్ గౌడ్, రవీందర్ గౌడ్, బాలాంజనేయులు, శ్రీనివాస్, పరశురాం, శ్రీహరి, వెంకటేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

BC JAC | అర్బన్​ ఎమ్మెల్యే మద్దతు..

ఈనెల 18వ తేదీన రాష్ట్ర బీసీ జేఏసీ సంఘం ఇచ్చిన బంద్​కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా గారు పేర్కొన్నారు. బీసీలకు న్యాయమైన వాట దక్కాలని అన్నారు. బీసీలు అంటే తనకు ఎనలేని గౌరవమని.. వారి హక్కుల కోసం ముందుండి పోరాడుతానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్​తో పాటు బుస్సా ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, బసవసాయి చంద్రకాంత్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

బీసీ సంక్షేమ సంఘం నాయకులతో కలిసి బంద్​ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా