Pocharam project | నిండు కుండలా పోచారం ప్రాజెక్టు.. దూకుతున్న అలుగు

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam project : కామారెడ్డి జిల్లా(Kamareddy district)లో ఎల్లారెడ్డి (Yellareddy), నాగిరెడ్డిపేట్ (Nagireddypet) మండలాల వరప్రదాయిని పోచారం ప్రాజెక్టు(Pocharam project ) పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని జలకళను సంతరించుకుంది. శనివారం (ఆగస్టు 16) ఉదయం ప్రాజెక్టు పూర్తిస్థాయి 21 అడుగులకు నీటిమట్టం చేరుకుని అలుగు దూకుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం 3వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు అలుగు పొర్లుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడు పంటలు బాగా పండుతాయని సంతోషం […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam project : కామారెడ్డి జిల్లా(Kamareddy district)లో ఎల్లారెడ్డి (Yellareddy), నాగిరెడ్డిపేట్ (Nagireddypet) మండలాల వరప్రదాయిని పోచారం ప్రాజెక్టు(Pocharam project ) పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని జలకళను సంతరించుకుంది. శనివారం (ఆగస్టు 16) ఉదయం ప్రాజెక్టు పూర్తిస్థాయి 21 అడుగులకు నీటిమట్టం చేరుకుని అలుగు దూకుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం 3వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది.

ప్రాజెక్టు అలుగు పొర్లుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడు పంటలు బాగా పండుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Pocharam project | హెచ్చరికలు జారీ..

గత మూడు రోజులపాటు భారీ వర్షాలు (heavy rains) ఉన్నందున ప్రాజెక్టు, వాగుల వైపు ఎవరూ వెళ్లకూడదని నీటిపారుదల శాఖ (Irrigation Department) డీఈ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ప్రధాన కాలువ ద్వారా 120 క్యూసెక్కుల నీటిని పంటల సంరక్షణకు వదులుతున్నట్లు ఆయన తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఉమ్మడి జిల్లా వరప్రదాయిని

మరోవైపు నిజాంసాగర్​ ప్రాజెక్ట్ కు కూడా ఇన్​ఫ్లో కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు​ ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా రైతులకు సాగు నీరు అందిస్తోంది. ఈ ప్రాజెక్ట్​ కింద 1.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. బాన్సువాడ (Bansuwada), బోధన్​ (Bodhan) నియోజకవర్గాల్లోని రైతులు ప్రాజెక్ట్​ నీటిపై ఆధారపడి పంటలు సాగు చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్​ నుంచి జులై 15న నీటి విడుదలను అధికారులు ప్రారంభించారు. ప్రాజెక్ట్​ నిండితే రెండు పంటలకు ఢోఖా ఉండదని రైతులు అంటున్నారు.

Related articles

February 24 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

February 24 Panchangam | తేదీ (DATE) – ఫిబ్రవరి 24,​ 2026 పంచాంగం (today horoscope) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

Second edition CM Cup | సెకండ్​ ఎడిషన్​ సీఎం కప్​ రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు.. ప్రతిభ చూపిన కాకతీయ ఒలంపియాడ్​ విద్యార్థిని

అక్షరటుడే, ఇందూరు: Second edition CM Cup | హైదరాబాద్​లోని సరూర్​నగర్​ ఇండోర్ స్టేడియంలో ఈనెల 20 నుంచి సెకండ్ ఎడిషన్ సీఎం కప్...

Telangana budget | మార్చి 16 నుంచి 30 వరకు అసెంబ్లీ సమావేశాలు.. 20న తెలంగాణ బడ్జెట్!

అక్షరటుడే, హైదరాబాద్​: Telangana budget | తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ముహూర్తం నిర్ణయం అయింది. వచ్చే నెల (మార్చి) 16వ తేదీ నుంచి...

Dharmapuri Sanjay Post | ధర్మపురి సంజయ్​కు గౌరవప్రదమైన పదవి ఇవ్వాలి..

అక్షరటుడే, ఇందూరు: Dharmapuri Sanjay Post | మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్​కు (Dharmapuri Sanjay) గౌరవప్రదమైన పదవి ఇచ్చి మున్నూరుకాపుల...