Homeబిజినెస్​Sumeet Industries | రూ. 4 నుంచి రూ. 172 కు.. ఏడాదిలో లక్షను రూ....

Sumeet Industries | రూ. 4 నుంచి రూ. 172 కు.. ఏడాదిలో లక్షను రూ. 42 లక్షలు చేసిన స్టాక్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sumeet Industries | స్టాక్‌ మార్కెట్‌(Stock market)లో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని కంపెనీల షేర్‌ ప్రైస్‌ ఆకాశానికి దూసుకుపోయి మల్టీ బ్యాగర్‌ రిటర్న్స్‌ అందిస్తాయి. ఇంకొన్ని పెట్టిన పెట్టుబడిని ఊడ్చేస్తాయి.

టెక్స్టైల్‌ సెక్టార్‌కు చెందిన స్మాల్‌ క్యాప్‌ కేటగిరి స్టాక్‌ అయిన సుమీత్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(Sumeet Industries Ltd) ఇన్వెస్టర్ల సంపదను గణనీయంగా పెంచింది. ఈ కంపెనీలో ఏడాది క్రితం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు అది రూ. 42.39 లక్షలకు చేరి ఉండేది.

స్మాల్‌ క్యాప్ (Small cap) కేటగిరి స్టాక్‌ అయిన సుమీత్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీ 2010లో స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయ్యింది. 21 రూపాయల ప్రాంతంలో లిస్టయిన కంపెనీ షేరు ధర ఒకానొక సమయంలో రూ. 2 దిగువకూ పడిపోయింది. గతేడాది సెప్టెంబర్‌ 26న ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 4గా ఉంది. అక్టోబర్‌లో 17 నాటికి రూ. 4.89కు చేరింది. అక్కడినుంచి ఎక్కువగా అప్పర్‌ సర్క్యూట్‌లు (Upper circuits) కొడుతూ వచ్చి గత సెషన్‌లో రూ. 172.99 వద్ద స్థిరపడిరది. అంటే ఏడాది క్రితం ఈ స్టాక్‌లో ఎవరైనా లక్ష రూపాయలు ఇన్వెస్ట్‌ చేసి ఉంటే ఆ స్టాక్స్‌ విలువ ప్రస్తుతం రూ. 42 లక్షలు దాటింది.

Sumeet Industries | భారీగా తగ్గనున్న షేరు ధర..

లక్షను 42 లక్షలు చేసిన ఈ స్టాక్‌ ప్రైస్‌(stock price).. అక్టోబర్‌ 3వ తేదీన ఐదో వంతుకు తగ్గనుంది. దీనికి కారణం కంపెనీ స్టాక్‌ స్ప్లిట్‌ ప్రకటించడమే.. కంపెనీకి చెందిన బోర్డు అఫ్‌ డైరెక్టర్స్‌ ఇటీవల సమావేశమై 1:5 రేషియోలో స్టాక్‌ స్ప్లిట్‌(Stock split)కు ఆమోదం తెలిపారు. పాటు దీనికి సంబంధించిన రికార్డు డేట్‌ను అక్టోబర్‌ 3గా నిర్ణయించారు. ప్రస్తుతం రూ. 10 ఫేస్‌ వాల్యూ(Face value) కలిగిన స్టాక్‌ను ఐదుగా విభజించనున్నారు.

దీని ప్రకారం ఒక స్టాక్‌ను హోల్త్‌ చేస్తున్నవారి ఖాతాలో మరో నాలుగు స్టాక్స్‌ యాడ్‌ కానున్నాయి. అదే నిష్పత్తిలో స్టాక్‌ ధర ఐదో వంతుకు పడిపోనుంది. స్టాక్‌ స్ప్లిట్‌ తర్వాత ఫేస్‌ వాల్యూ రూ.2 గా ఉండనుంది. అయితే ధర పెరుగుతోందని కంపెనీ గురించి తెలుసుకోకుండా పెట్టుబడి పెట్టడం అంటే సంపదను రిస్క్‌లో పెట్టడమే. ఫండమెంటల్స్‌ చూసుకుని ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది.

Must Read
Related News