అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Inter Practicals | ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సైన్స్ విద్యార్థులకు (Science Students) ప్రస్తుతం సెకండియర్లోనే ప్రయోగ పరీక్షలు ఉండగా.. వచ్చే ఏడాది నుంచి ఫస్టియర్ విద్యార్థులకు అమలు చేయనున్నారు.
ప్రస్తుతం ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు (Practical Exams) నిర్వహిస్తున్నారు. వీటిని సెకండియర్‌లో నిర్వహిస్తున్నారు. ఎంపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీలో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లకు ప్రయోగ పరీక్షలు జరుపుతున్నారు. ఒక్కో పరీక్షకు 30 మార్కులు ఉంటాయి. అయితే ఫస్టియర్‌లో ప్రయోగ పరీక్షలు లేకపోవడంతో విద్యార్థులు ల్యాబ్‌లకు వెళ్లడం లేదు. సెకండియర్‌లో మాత్రమే ప్రాక్టికల్స్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పులు తేవడానికి ప్రభుత్వం నిర్ణయించింది.
Inter Practicals | సీఎం ఆమోదం
ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు పెట్టడానికి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆమోదం తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఒక్కో సబ్జెక్ట్ ప్రాక్టికల్ పరీక్షకు 30 మార్కులు ఉండగా.. వచ్చే ఏడాది నుంచి ఫస్టియర్‌లో 15 మార్కులు, సెకండియర్‌లో 15 మార్కులతో పరీక్షలు పెడతారు.
Inter Practicals | ఇంటర్నల్ మార్కులు
ఇంటర్లో ఇక నుంచి అన్ని సబ్జెక్టుల్లో 80 శాతం మార్కులకే రాత పరీక్ష ఉంటుంది. 20 శాతం మార్కులు ఇంటర్నల్ పరీక్షల ద్వారా కేటాయిస్తారు. ప్రస్తుతం ఇంగ్లిష్ సబ్జెక్ట్‌కు మాత్రమే ఇంటర్నల్స్ ఉండగా.. ఇక నుంచి అన్ని సబ్జెక్టులకు అమలు చేయాలని ఇంటర్ బోర్డు (Inter Board) నిర్ణయించింది. అలాగే కొత్తగా ఏసీఈ (ఎకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులతో) గ్రూపును అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం సీఈసీ గ్రూపులో సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్ట్‌లు ఉన్నాయి.
కాగా.. ఈ ఏడాది ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 25 నుంచి ఫస్టియర్, 26 నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గతేడాది మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగాయి. అయితే సెకండియర్ విద్యార్థులకు ఈఏపీసెట్, ఐఐటీలాంటి ఎంట్రెన్స్ పరీక్షలకు సిద్ధం కావడానికి వీలుగా పరీక్షలను ముందుకు జరుపుతూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
