అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : అమెరికా Telangana, తెలంగాణ America ల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief Minister Revanth Reddy ఆకాంక్షించారు. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం (జులై 11) హైదరాబాద్ కాన్సూల్ జనరల్ జన్నిఫర్ లార్సన్ Hyderabad Consul General Jennifer Larson ఇచ్చిన దౌత్యపరమైన విందులో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అమెరికా – తెలంగాణల మధ్య వాణిజ్యపరమైన సంబంధాలు మరింత మెరుగుపరచడానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తెలంగాణను 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్నారు. దీనిని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ స్థాయికి పెంచుతామన్నారు. ఈ మేరకు తెలంగాణ రైజింగ్ దార్శనికతతో పని చేస్తున్నామన్నారు. దీనికి అందుకు అమెరికన్ల మద్దతు కావాలని కోరారు.
CM Revanth : ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా..
“అమెరికాకు స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ప్రపంచంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రపంచం ముందు అమెరికా అనేక సానుకూలతలను ప్రదర్శించింది. ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా మారింది.. నవీన ఆవిష్కరణలతో ప్రపంచ దృక్కోణాన్ని మార్చిందని సీఎం అన్నారు.
ఎల్లప్పుడూ బలమైన దేశంగా.. అనేక అంశాల్లో సానుకూల పరిష్కారాలు చూపించడంలో అమెరికా స్ఫూర్తిని ప్రదర్శించింది. 2008 లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి YS Rajasekhara Reddy హయాంలో హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఏర్పాటైన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ గుర్తుచేశారు. స్వాతంత్య్రం అనంతరం భారత్‌లో ప్రారంభించబడిన తొలి యూఎస్ దౌత్య కార్యాలయం ఇదేనని తెలిపారు.
అమెరికాతో తెలుగు ప్రజలకు ఉన్న స్నేహపూర్వకమైన బంధం ఎంతో బలమైంది. అమెరికాలో తెలుగు భాష వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎంతో మంది ఇక్కడి విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకోవడానికి అమెరికా వెళుతున్నారు.
హైదరాబాద్ కాన్సూల్ జనరల్ శ్రీమతి జెన్నిఫర్ లార్సన్ గురించి సీఎం గొప్పగా వర్ణించారు. రెండు సంస్కృతుల మధ్య, ప్రజల మధ్య ఆమె వారధిగా ఉన్నట్లు పేర్కొన్నారు. వాణిజ్యపరమైన సంబంధాలను పటిష్ఠపరచడంలోనూ ఇరు దేశాల మధ్య బలమైన వారధిగా ఆమె నిలుస్తున్నారని తెలిపారు.
ఐటీ IT, ఫార్మా pharma, డిఫెన్స్ defense, మాన్యుఫాక్చరింగ్ manufacturing, ఏరోస్పేస్ aerospace వంటి రంగాలకు చెందిన దాదాపు 200 అమెరికా కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా ప్రస్తుతం పనిచేస్తున్నాయని సీఎం వివరించారు.
హైదరాబాద్ మరింత పురోభివృద్ధి సాధించాలని రేవంత్ ఆకాంక్షించారు. అమెరికాలోని అత్యుత్తమైన వాటిని తెలంగాణకు తీసుకొస్తారని నేను ఆయన ఆస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు థీమ్‌గా నిర్ధేశించిన కోణంలో చెప్పాలంటే.. “ఒక్కటిగా ఉంటే.. మరింత పటిష్ఠంగా..” ఎదగగలమని నేను విశ్వసిస్తున్నా..” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.