అక్షరటుడే, ఆర్మూర్: Armoor | పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం పట్టణంలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ (friendly cricket match) నిర్వహించారు. పట్టణంలోని మినీ స్టేడియంలో పోలీసులు, జర్నలిస్టుల మధ్య మ్యాచ్ జరిగింది. ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి (ACP Venkateswara Reddy) ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.
ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం జరిగిన మ్యాచ్‌లో పోలీస్ టీం (police team) విజేతగా నిలవగా.. జర్నలిస్టు టీం రన్నరప్‌గా నిలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పోలీస్ టీం 12 ఓవర్లలో 101 పరుగులు చేయగా.. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జర్నలిస్ట్ టీం (journalist team) 12 ఓవర్లలో 55 పరుగులు మాత్రమే చేశారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ, జర్నలిస్టులు సందీప్, సంజీవ్, రాజేశ్వర్ గౌడ్, రాజేష్, సుదర్శన్, వినోద్, అనీఫ్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
