అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామంలో సోమవారం (సెప్టెంబరు 8) కుట్టుమిషన్ పంపిణీ, ఉచిత కుట్టుమిషన్ శిక్షణ చేపట్టారు. జల జీవన్, ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ Women Empowerment Society ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అర్హతగల మహిళలకు 50% సబ్సిడీతో కుట్టుమిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా జలజీవన్, ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ ఆర్గనైజేషన్ సీఈఓ రవికుమార్, డిస్టిక్ కోఆర్డినేటర్ జి.అంజమ్మ మాట్లాడారు.
Free sewing machine training : గ్రామీణ మహిళల సౌకర్యార్థం..
గ్రామీణ మహిళల సౌకర్యార్థం ఈ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు. ఆసక్తిగల మహిళలకు కుట్లు, అల్లికల శిక్షణ ఇస్తామన్నారు. ఇందుకోసం ట్రైనర్ వరలక్ష్మిని అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
పటేల్ సాయులు, కమ్మరి భాస్కర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో ఉచిత కుట్టు మెషన్ శిక్షణ కార్యక్రమం చేపట్టడం శుభపరిణామమని పేర్కొన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు.