అక్షరటుడే, వెబ్‌డెస్క్:CM Revanth Reddy | ప్రతి సంవత్సరం మహిళా సంఘాల సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ (Telangana Formation Day) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు (Free Medical Checkups) చేస్తామని, దీనికోసం క్యూ ఆర్ కోడ్‌తో కూడిన కార్డులు అందిస్తామని తెలిపారు.
CM Revanth Reddy | ఆకాంక్షలు నెరవేరలేదు
తెలంగాణ (Telangana) ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని సీఎం అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే చర్యలు చేపట్టిందన్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పదేళ్ల ఆధిపత్యాన్ని ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. తాము అధికారం చేపట్టే నాటికి వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయని విమర్శించారు. తెలంగాణను పునర్నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.
CM Revanth Reddy | మహిళల కోసం అనేక పథకాలు
తాము అధికారంలోకి వచ్చాక మహిళల కోసం అనేక పథకాలు తీసుకొచ్చినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రుణాలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఆడబిడ్డలకే ఇందిరమ్మ ఇళ్లు (Indiaramma Houses) కేటాయిస్తున్నామన్నారు. ఇందిర మహిళా శక్తి ద్వారా మహిళా సంఘాల ఉత్పత్తుల విక్రయించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఆర్టీసీలో మహిళా సంఘాల బస్సుల సంఖ్యను 600కు పెంచుతామన్నారు.
CM Revanth Reddy | ధరణి చట్టం కొందరికి చుట్టం
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టం కొందరికి చుట్టమైందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ధరణి(Dharani)తో భూ సమస్యలు పేరుకు పోయి రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడానికి తమ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకు వచ్చిందన్నారు. అంతేగాకుండా రూ.రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశామని చెప్పారు. రైతు భరోసా (Raithu Bharosa) కింద ఏడాదికి ఎకరాకు రూ.12 వేలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. విద్యార్థుల కోసం యంగ్ ఇండియా స్కూల్స్ (Young India Schools) నిర్మిస్తున్నామన్నారు. త్వరలో ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా పేదలకు ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఇప్పటి వరకు 5,364 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.53.64 కోట్లు జమ చేశామన్నారు.