అక్షరటుడే, ఇందూరు: Medical Camp | నగరంలో వర్ని చౌరస్తాలో ఉన్న పవర్‌హౌస్‌లో వెల్నెస్ హాస్పిటల్స్ (Wellness Hospitals) ఆధ్వర్యంలో ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. టీజీ ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ ఎలక్ట్రిసిటీ, వెల్నెల్ హాస్పిటల్స్ సంయుక్తంగా మంగళవారం ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు (Electricity employees) పాల్గొని వైద్యసేవలను వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ట్రాన్స్‌కో ఎస్ఈ రవీందర్ (Transco SE Ravinder) మాట్లాడుతూ.. వెల్నెస్ ఆస్పత్రి ఉపాధ్యక్షుడు బోదు అశోక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం (free medical camp) నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ శిబిరాన్ని ఉద్యోగులు విజయవంతం చేశారన్నారు. అదేవిధంగా వెల్నెస్ ఆస్పత్రి ఉపాధ్యక్షుడు బోదు అశోక్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో తమ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు.
అందులో భాగంగా ఎలక్ట్రిసిటీ పవర్ హౌస్‌లో వైద్యశిబిరం నిర్వహించి ఉద్యోగులకు పలు రకాల పరీక్షలు చేసి మందులను ఉచితంగా పంపిణీ చేశామని వివరించారు. అనంతరం కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయిరాం ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గుండెపోటు (heart attack) లక్షణాలు (ఛాతీనొప్పి, శ్వాస ఆడకపోవడం, చల్లని చెమట, వికారం, తల తిరగడం) కనిపించినప్పుడు వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచించారు. గుండెనొప్పి వచ్చినప్పుడు లక్షణాలను గుర్తించడం, తక్షణ చికిత్స తీసుకోవడం ముఖ్యమని వివరించారు.
అలాగే ధూమపానం మానేయడం, రక్తపోటు (blood pressure) మరియు మధుమేహం నియంత్రణలో ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటు నివారణ సాధ్యమేనన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజీషియన్ అపర్ణ, యూరాలజిస్ట్ ప్రశాంత్ రెడ్డి, ఆర్థోపెటిక్ భాస్కరరావు, క్రిటికల్ కేర్ వైద్యుడు అభినవ్, న్యూరో సర్జన్ కేతావత్ కిరణ్ వైద్య సేవలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్నెస్ హాస్పిటల్ మేనేజర్లు హరిన్ కృష్ణ, రాజేష్, ఆస్పత్రి సిబ్బంది రాజశేఖర్, శైలేష్ తదితరులు పాల్గొన్నారు.