అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Padmashali Sangham | జిల్లాలోని పేద పద్మశాలి యువతులకు (Poor Padmashali Womens) సంఘం తరపున ఉచితంగా పెళ్లిళ్లు చేయనున్నట్లు అఖిల భారత పద్మశాలి సంఘం సెంట్రల్ కమిటీ సభ్యులు నర్సింలు పేర్కొన్నారు. జిల్లా పద్మశాలి సంఘం (District Padmashali Association) నాయకులను నూతనంగా ఎన్నికైన జిల్లా మహిళా పద్మశాలి సంఘం ప్రతినిధులు శనివారం సన్మానించారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఖలీల్వాడిలోని జిల్లా పద్మశాలి సంఘం భవనంలో మహిళా సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అఖిలభారత పద్మశాలి సంఘం సెంట్రల్ కమిటీ సభ్యులు దాసరి నర్సింలు, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు మైసల నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు గంగాప్రసాద్లను మహిళా సంఘం ప్రతినిధులు సన్మానించారు.
Padmashali Sangham | ఉచితంగా వివాహాలు..
ఈ సందర్భంగా దాసరి నర్సింలు మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో నిరుపేద పద్మశాలి కులస్థులకు ఉచితంగా పెళ్లిళ్లు (free marriages) చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా పెళ్లి చేయలేని స్థితిలో పేద పద్మశాలి కులస్థులు తమను సంప్రదిస్తే వారి కూతుళ్లకు ఉచితంగా పెళ్లిళ్లు చేస్తామన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం మహిళా సంఘం ప్రతినిధులు చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా పద్మశాలి సంఘం అధ్యక్షురాలు చాట్ల అన్నపూర్ణ, ఉపాధ్యక్షురాలు చాట్ల రేణుక, సహాయ కార్యదర్శి సరస్వతి, పద్మశాలి సంఘం జిల్లా కోశాధికారి దిండిగళ్ల శంకర్, సహాయ కార్యదర్శి పద్మ సుభాష్, కుందెన ఉమేష్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.