అక్షరటుడే, నిజాంసాగర్: Mahammad nagar | స్వాతంత్య్ర దినోత్సవం రోజు యథేచ్ఛగా మద్యం విక్రయాలు కొనసాగాయి. ఎక్సైజ్‌శాఖ (Excise Department) అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మద్యం ఏరులై పారుతోంది.
మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) జరుపుకుంటుండగా.. బెల్ట్‌షాపుల్లో (Belt shops) మద్యంను యథేచ్ఛగా విక్రయించారని పలువురు ఆరోపించారు.
కనీసం స్వాతంత్య్ర దినోత్సవం రోజైనా మద్యం విక్రయాలకు కళ్లెం వేయాల్సిన ఎక్సైజ్ అధికారులు నిద్రావస్థలో ఉండడంతో.. అడ్డూఅదుపు లేకుండా అమ్మకాలు సాగాయని మహమ్మద్‌నగర్ వాసులు ఆరోపిస్తున్నారు. మండలంలోని నర్వ(Narva) గ్రామంలో కల్లు విక్రయాలు రోజు మాదిరిగానే జరిగాయి. అలాగే పలు గ్రామాల్లో సైతం మద్యం, కల్లు విక్రయాలు జరిగినా పట్టించుకునేవారే లేరని మండలవాసులు వాపోతున్నారు.