అక్షరటుడే, డిచ్పల్లి : 7th Bettalion | మండలంలోని తెలంగాణ ప్రత్యేక పోలీస్ ఏడవ బెటాలియన్(7th Bettalion)లో మంగళవారం హెల్త్క్యాంప్ నిర్వహించారు. కమాండెంట్ సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా జనరల్ ఆస్పత్రి, డీఎంహెచ్వో (DMHO) రాజశ్రీ పర్యవేక్షణలో పీఎం టీబీ ముక్త్ అభియాన్(PM TB Mukt Abhiyan)లో భాగంగా క్యాంప్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రెండు రోజులు పాటు బెటాలియన్లో సిబ్బందికి వైద్య పరీక్షలు చేయనున్నారు. ఇందులో పలు రకాల ఆరోగ్య పరీక్షలు, ఛాతి సంబంధిత పరీక్షలు, టీబీ, హెచ్ఐవీ టెస్ట్(HIV), హెపటైటిస్ బీ (Hepatitis B), వీడీఆర్ఎస్ (VDRL), హిమోగ్లోబిన్ (Hemoglobin) పరీక్షలు నిర్హహిస్తున్నామని వైద్య సిబ్బంది తెలిపారు. బెటాలియన్ అధికారులు, సిబ్బంది మరియు కుటుంబసభ్యులు ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ శరత్ కుమార్, యూనిట్ మెడికల్ ఆఫీసర్ శ్రీయాన్, అనుపమ, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, మెడికల్ సిబ్బంది, సిబ్బంది పాల్గొన్నారు.