HomeజాతీయంFASTag | ఉచితంగా రూ.వెయ్యి ఫాస్టాగ్​ రీఛార్జ్​.. వాహనదారులు ఏం చేయాలంటే?

FASTag | ఉచితంగా రూ.వెయ్యి ఫాస్టాగ్​ రీఛార్జ్​.. వాహనదారులు ఏం చేయాలంటే?

FASTag | టోల్​ప్లాజాల వద్ద మూత్రశాలల నిర్వహణను మెరుగు పర్చడానికి ఎన్​హెచ్​ఏఐ చర్యలు చేపట్టింది. అపరిశుభ్రంగా ఉన్న మూత్రశాలలపై ఫిర్యాదు చేస్తూ రూ.వెయ్యి ఫాస్టాగ్​ రీఛార్జి ఉచితంగా అందిస్తామని ప్రకటించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : FASTag | జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఎన్​హెచ్​ఏఐ బంపర్​ ఆఫర్​ ఇచ్చింది. అపరిశుభ్రంగా ఉన్న మూత్రశాలలపై రిపోర్టు చేస్తే రూ.వెయ్యి ఫాస్టాగ్​ రీఛార్జ్​ను (FASTag Recharge) ఉచితంగా అందించనుంది.

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల నుంచి ఎన్​హెచ్​ఏఐ (NHAI) టోల్​ వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజల సమయం ఆదా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్​ విధానం అమలులోకి తెచ్చింది. అయితే ప్రభుత్వం టోల్​ వసూలు చేస్తున్న రోడ్లు, హైవేలపై టాయిలెట్స్ (Toilets)​ బాగుండడం లేదని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా మూత్రశాలల నిర్వహణ సక్రమంగా లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అనేక ఫిర్యాదులు రావడంతో ఎన్​హెచ్​ఏఐ కీలక చర్యలు చేపట్టింది.

FASTag | రాజ్​మార్గ్​ యాత్ర యాప్​లో..

టోల్ ప్లాజాల (Toll Plaza) వద్ద టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉంటే రిపోర్టు చేసేలా NHAI ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. వినియోగదారులు ‘రాజ్‌మార్గ్​ యాత్ర’ యాప్ ద్వారా అపరిశుభ్రంగా ఉన్న మూత్రశాలల జియో-ట్యాగ్ చేయబడిన చిత్రాలను అప్​లోడ్​​ చేస్తే రూ.1,000 ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ రివార్డ్‌ను పొందవచ్చు. అక్టోబర్ 31 వరకు ఈ స్కీమ్​ అందుబాటులో ఉంటుంది. రహదారులపై పరిశుభ్రతను మెరుగుపరచడానికి భారత జాతీయ రహదారుల అథారిటీ (NHAI) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

FASTag | ఇలా చేయాలి

వాహనదారులు రాజ్‌మార్గ్​ యాత్ర యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. NHAI పరిధిలోని టోల్ ప్లాజాలలో మురికి టాయిలెట్ల స్పష్టమైన, జియో-ట్యాగ్, టైమ్​ టైమ్-స్టాంప్ చేసిన చిత్రాలను అప్​లోడ్​ చేయాలి. యాప్ ద్వారా యూజర్ పేరు, స్థానం, వాహన రిజిస్ట్రేషన్ నంబర్ (VRN), మరియు మొబైల్ నంబర్‌తో సహా వివరాలను సమర్పించండి. మురికి టాయిలెట్లను నివేదించే ప్రతి VRN రూ.వెయ్యి ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్‌కు అర్హత పొందుతుంది. ఈ రివార్డు ఫాస్టాగ్ (FASTag)​ కోసం మాత్రమే వినియోగించుకోవచ్చు.

FASTag | వీటికి మాత్రమే..

ఎన్​హెచ్​ఏఐ నిర్వహించే టోల్​ప్లాజాల వద్ద మూత్రశాలల్లో తీసిన చిత్రాలకు మాత్రమే రివార్డు వస్తుంది. మొత్తం స్కీమ్ వ్యవధిలో ఒక వాహన రిజిస్ట్రేషన్​ నంబర్​పై ఒక రివార్డు మాత్రమే వస్తుంది. ఒకే టాయిలెట్​ బాగాలేదని ఒక రోజు చాలా మంది ఫిర్యాదు చేస్తే మొదట చేసిన వారికి మాత్రమే రివార్డు లభిస్తుంది. మిగతా వారికి రాదు.