అక్షరటుడే, హైదరాబాద్: Free driving training | అతివలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ‘డ్రైవర్ ఉద్యోగ మేళా’ను చేపడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ మహిళలకు ప్రత్యేక సదుపాయం కల్పించబోతోంది. వీరికి బైక్ టాక్సీ bike taxi, ఈ ఆటో డ్రైవింగులో ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. లైసెన్స్ జారీలో అండగా నిలవనుంది.
Free driving training | రుణ సదుపాయం..
డ్రైవింగ్ ఉచిత శిక్షణతోపాటు వాహన రుణం / లీజు సౌకర్యం, ఉపాధి కూడా కల్పిస్తుంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చు. 21-45 ఏళ్ల మధ్య (హైదరాబాద్ మహిళలు) వారు అర్హులు. ఔత్సాహిక అతివలు జనవరి 3 వ తేదీన అంబర్పేట్ పోలీస్ శిక్షణ కేంద్రానికి చేరుకుని, అక్కడి అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. మరిన్ని 89788 62299 నంబరులో సంప్రదించాలని పోలీసు అధికారులు సూచించారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.