అక్షరటుడే, ఆర్మూర్: Dental Camp | శీనునాయక్ డెంటల్ ఆస్పత్రి (Seenu Nayak Dental Hospital) ఆధ్వర్యంలో అంకాపూర్‌లో ఉచిత దంతవైద్య శిబిరం (Free dental camp) నిర్వహించారు. ఈ మేరకు గురువారం గ్రామంలో (Ankapoor village) ప్రజలకు ఉచితంగా దంతవైద్య పరీక్షలు చేశారు.
అనంతరం దంత సంరక్షణపై అవగాహన కల్పించారు. దంతాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అనంతరం చికిత్స చేయించుకున్న సుమారు 60మందికి దంత సంరక్షణ కిట్లు, పేస్ట్‌లు అందజేశారు.
