ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Free Bus Scheme | మహిళలకు శుభవార్త.. ఏపీలో ఫ్రీ బ‌స్సు స్కీంకు ముహూర్తం ఫిక్స్...

    Free Bus Scheme | మహిళలకు శుభవార్త.. ఏపీలో ఫ్రీ బ‌స్సు స్కీంకు ముహూర్తం ఫిక్స్ చేసిన సీఎం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Free Bus Scheme | కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డానికి సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు (super six schemes) హామీ ఇవ్వ‌డం మ‌నం చూశాం. ఎన్నికల (election) హామీల్లో భాగంగా కూటమి ఇచ్చిన వాటిలో ఉచిత బస్సు (free bus) హామీ కీలకమైనదిగా చెప్పుకోవ‌చ్చు. ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం జూన్ లో అమ్మకు వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయాలని నిర్ణయించారు. ఆగస్టు (august) పదిహేను నుంచి స్వాతంత్య్ర దినోత్సవం (independence day) సందర్భంగా ఉచిత బస్సును ప్రారంభిస్తారు. సి క్యాంప్‌ రైతు బజార్‌లో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో (swarnandhra – swachchhandhra program) సీఎం పాల్గొని రైతులు, పారిశుధ్య కార్మికులతో మాట్లాడారు.

    Free Bus Scheme | ఫ్రీ బ‌స్సు ఎప్ప‌టి నుండి అంటే..

    కూరగాయల వ్యర్థాలతో ఎరువుల తయారీ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ధనలక్ష్మి నగర్‌లో ఉద్యానవనం అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి (chief minister chandra babu naidu) శంకుస్థాపన చేశారు. అక్కడ ప్రసగించారు. ఈ సందర్భంగా ఉచిత బస్సు పథకంపై (free bus scheem) స్పందించారు. ఆగస్టు పదిహేనో తేదీ నుంచి అమలు చేస్తామన్నారు. మహిళల సామాజిక, ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రోత్సహించడం, రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం (AP governament) సంకల్పించింది. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తే రోజుకు సుమారు 25 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.

    తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (telangana congress governament) కూడా ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తోంది. కర్ణాటకలో.. ఢిల్లీలోనూ అమల్లో ఉంది. అన్నిచోట్లా పథకం అమలును ఏపీ అధికారులు పరిశీలించారు. సమస్యలన్నింటినీ అధ్యయనం చేసిన ప్రభుత్వం (governament) వెయ్యి కొత్త బస్సుల్ని కొనుగోలు చేసి.. కొత్త సిబ్బందిని నియమించుకుని పథకాన్ని (scheem) అమలు చేయాలనుకుంటోంది. అందుకే ఆలస్యం అయినట్లుగా తెలుస్తోంది. పథకం ప్రారంభించిన మొదట్లో మహిళలు ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అలాగే అవసరమైన వారు మాత్రమే ప్రయాణించేలా చూడాలన్న సూచనలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లను పెంచింది. అలాగే అన్న క్యాంటీన్లను (anna canteens) ఏర్పాటు చేసింది. పలు రకాల పథకాలను అమ‌లు చేస్తూ అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతుంది.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 6 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kartavya Bhavan | నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 6 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kartavya Bhavan | నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....